Begin typing your search above and press return to search.

పుష్ప 2 వర్సెస్ వీరమల్లు.. అదే జరిగితే మాత్రం..!

ఐతే ఈ టైం లో పవన్ కళ్యాణ్ సినిమా తో అల్లు అర్జున్ సినిమా పోటీకి దిగితే మాత్రం ఊహించడం కూడా కష్టమే అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:30 AM GMT
పుష్ప 2 వర్సెస్ వీరమల్లు.. అదే జరిగితే మాత్రం..!
X

పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా అల్లు ఆర్మీని ఎటాక్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ తెలిసిందే. ఇదంతా ఏపీ ఎలక్షన్ టైం లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ వైసీపీ తరపున పోటీ చేస్తుంటే అతనికి సపోర్ట్ చేయడమే. ఆ తర్వాత పవన్ కే తన మద్దతు అని చెప్పినా కూడా ఫ్యాన్స్ కన్విన్స్ అవ్వలేదు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసినట్టుగా మనవాడు పరాయివాడు అంటూ మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ వేసి డిలీట్ చేయడం కూడా మెగా వర్సెస్ అల్లు గొడవపై స్పష్టత వచ్చింది.

ఈ వేడి మీద ఆగష్టు లో పుష్ప 2 వస్తే కచ్చితంగా ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడేది. ఐతే సినిమా పూర్తి కాకపోవడం తో పుష్ప 2 ని డిసెంబర్ కి వాయిదా వేశారు. ఎలక్షన్స్ జరిగి నెలలు అవుతున్నా కూడా అల్లు ఆర్మీ, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతూనే ఉంది. ఐతే ఈ టైం లో పవన్ కళ్యాణ్ సినిమా తో అల్లు అర్జున్ సినిమా పోటీకి దిగితే మాత్రం ఊహించడం కూడా కష్టమే అనిపిస్తుంది.

పుష్ప 2 ని డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు సినిమాను త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ మరో 20 రోజులు డేట్స్ ఇస్తే హరి హర వీరమల్లు పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఐతే అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో వీరమల్లు రిలీజ్ ఉంటుందని టాక్. అలా అయితే పుష్ప 2 వచ్చిన టైం లోనే వీరమల్లు రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

పుష్ప 2 వర్సెస్ వీరమల్లు ఒకే రోజు కాదు వారం రోజులు గ్యాప్ ఉన్నా కూడా మెగా వర్సెస్ అల్లు ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇక సోషల్ మీడియా ఐతే హోరెత్తించేయడం ఖాయం. పుష్ప 2 ఆల్రెడీ ఇప్పుడనుకున్న డిసెంబర్ 6న రావడం పక్కా.. కాబట్టి ఆ డేట్ చూసుకుని పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ చేస్తే బెటర్. లేదంటే మాత్రం మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ మధ్య యుద్ధానికి తెర లేపినట్టే అవుతుంది.