అల్లు అర్జున్.. నెక్స్ట్ త్రివిక్రమ్ తో కాదా?
ఈ సినిమాతో అల్లు అర్జున్ ని పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే ఇమేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప 3’ ర్యాంపేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.
By: Tupaki Desk | 21 Dec 2024 10:44 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటికి డీసెంట్ వసూళ్లతో ఈ మూవీ దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1600 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ని పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే ఇమేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప 3’ ర్యాంపేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.
అయితే ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి బన్నీ కొంత సమయం తీసుకుంటాడని అందరూ భావించారు. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని అల్లు అర్జున్ లైన్ లో పెట్టాడు. ఈ సినిమాని 2025 ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు బన్నీ తన ఆలోచన మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా నెక్స్ట్ పార్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ మరో మూడేళ్ళ టైం ఇస్తే కచ్చితంగా పూర్తిచేస్తామని అన్నారు. ‘పుష్ప 2’ సక్సెస్ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఈ పార్ట్ 3 వెంటనే వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఈ మూడో పార్ట్ ని ముందుగానే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారంట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి ఈ సినిమాని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
సుకుమార్ నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయాల్సి ఉంది. అయితే దానిని వెనక్కి తీసుకెళ్లి ‘పుష్ప 3’ ముందుగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడంట. ప్రస్తుతం ఇదే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.
ఒకవేళ ఈ వార్త నిజమైతే త్వరలోనే దీనిపై అధికారికంగా కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘పుష్ప’ సిరీస్ మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. నెక్స్ట్ ఎం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇదే స్పీడ్ లో ‘పుష్ప 3’ కూడా వీలైనంత వేగంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తే కచ్చితంగా 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.