Begin typing your search above and press return to search.

పుష్ప 2.. మళ్ళీ అలాంటి షాక్ ఇవ్వరుగా?

ఇంకా ఈ మూవీ 35 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని ఒక వార్త కొద్ది రోజుల క్రితం బయటకొచ్చింది.

By:  Tupaki Desk   |   18 July 2024 9:03 AM GMT
పుష్ప 2.. మళ్ళీ అలాంటి షాక్ ఇవ్వరుగా?
X

పుష్ప ది రూల్ మూవీ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన చేశారు. ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంకా ఈ మూవీ 35 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని ఒక వార్త కొద్ది రోజుల క్రితం బయటకొచ్చింది. ఇంతలో మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ పుష్ప ది రూల్ లుక్ లో కనిపించలేదు. గెడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు సుకుమార్ కూడా యూఎస్ ట్రిప్ లో ఉన్నాడనే కథనం తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఎవరి వ్యాపకాలలో వారు ఉండటంతో షూటింగ్ వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా 80 శాతం కూడా కంప్లీట్ కాలేదని, ఫాహద్ ఫాజిల్ సీక్వెన్స్ అస్సలు షూట్ చేయలేదనే మాట వినిపిస్తోంది. ఇవన్నీ కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుందని టాక్ నడుస్తోంది. అందుకే డిసెంబర్ లో కూడా సినిమా రిలీజ్ కాకపోవచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బన్నీ, సుకుమార్ మధ్య కూడా గ్యాప్ పెరిగిందని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే అసహనంతోనే అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేసాడని అంటున్నారు. పలు కారణాల వలన పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ 2025కి వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నారంటూ టాక్ తెరపైకి వచ్చింది.

ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని డిసెంబర్ 6కి కచ్చితంగా పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది. సుకుమార్ తో విభేదాలు ఉన్నాయనేది పూర్తిగా నిరాధార సమాధారం అని బన్నీ పీఆర్ టీమ్ ప్రకటన చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సైతం సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. కేవలం సినిమాపై నెగిటివిటీ పెంచే ఉద్దేశ్యంతో ఆధారం లేని గాసిప్స్ ప్రచారం చేస్తున్నారనే మాట బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ గాసిప్స్ లో వాస్తవం లేదని నిర్మాణ సంస్థ అధికారికంగా క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. లేదంటే ఈ ప్రచారంతో పుష్ప ది రూల్ మూవీ నెగిటివ్ ప్రచారం మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని భావిస్తున్నారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప ది రూల్ పై నడుస్తోన్న ప్రచారాలకు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారనేది వేచి చూడాలి.