Begin typing your search above and press return to search.

1000 కోట్ల టార్గెట్ కు ఇది సరిపోదు పుష్ప..?

పుష్ప ది రూల్ మూవీతో అది సాధ్యం అవుతుందని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 May 2024 4:40 AM GMT
1000 కోట్ల టార్గెట్ కు ఇది సరిపోదు పుష్ప..?
X

టాలీవుడ్ లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలు అంటే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలు రాజమౌళి నుంచి వచ్చాయి. అలాగే ప్రభాస్, రామ్ చరణ్, తారక్ పేర్లు 1000 కోట్ల క్లబ్ హీరోలుగా ప్రస్తుతం ఉన్నారు. ఈ క్లబ్ లోకి చేరాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అనుకుంటున్నారు. పుష్ప ది రూల్ మూవీతో అది సాధ్యం అవుతుందని భావిస్తున్నారు.

మూవీపై వీలైనంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా గ్లోబల్ మార్కెట్ లో పుష్ప ది రూల్ మూవీతో బజ్ క్రియేట్ చేసే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు గ్లింప్స్, టీజర్, సాంగ్ రిలీజ్ అయ్యాయి. వీటిలో గ్లింప్స్ అయితే కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ మధ్య కాలంలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ని రిప్రజెంట్ చేస్తూ టీజర్ వదిలారు.

టీజర్ ట్రెండింగ్ లోకి వచ్చిన ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. అలాగే మే 1న రిలీజ్ అయిన పుష్ప ఫస్ట్ సింగిల్ తెలుగు, హిందీ భాషలలో బాగానే ట్రెండ్ అయ్యింది. హిందీలో 24 గంటల్లో 24 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది. తెలుగులో 21 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అయితే మలయాళం, కన్నడ భాషలలో 2 మిలియన్ వ్యూస్, తమిళంలో 1 మిలియన్ వ్యూవ్స్ మాత్రమే ఈ సాంగ్ కి వచ్చాయి.

పుష్ప ది రూల్ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలంటే కేవలం తెలుగు, హిందీ భాషలలో వర్క్ అవుట్ అయితే సరిపోదు అనేది ట్రేడ్ పండితుల మాట. సౌత్ లో అన్ని భాషలలో మూవీ క్లిక్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కోలీవుడ్ లో 80 కోట్ల కలెక్షన్స్ తెచ్చుకుంటే బాహుబలి 2 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. మలయాళీ, కన్నడ భాషలలో కూడా ఈ సినిమాలు 50 కోట్లకి పైనే గ్రాస్ వసూళ్లు చేశాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 వెయ్యి కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయగలిగాయి.

అయితే పుష్ప 2 మూవీ నుంచి వచ్చిన సాంగ్, టీజర్ తెలుగు, హిందీ భాషలలో తప్ప ఇతర సౌత్ భాషలలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సినిమా రిలీజ్ వరకు ఇదే పద్ధతి కొనసాగితే మూవీకి ఇతర సౌత్ భాషలలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అన్ని భాషలలో కూడా ప్రభావం చూపిస్తే 1000 కోట్ల మార్క్ ని పుష్ప ది రూల్ అందుకోగలుగుతుందని అంటున్నారు.