Begin typing your search above and press return to search.

పుష్ప 3 ఉంది.. కానీ..

సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా అల్లు అర్జున్ అనే స్టార్ కనిపించడు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 11:30 PM GMT
పుష్ప 3 ఉంది.. కానీ..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప రాజ్ క్యారెక్టర్ ఆల్ టైమ్ లో బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్ కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. అంతగా ఆ పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. ఈ పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా అల్లు అర్జున్ అనే స్టార్ కనిపించడు.

కేవలం పుష్పరాజ్ మాత్రం కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా పుష్ప 2 మూవీ భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తూంది.

ఈ సినిమా కోసం సుకుమార్ మూడేళ్ళ సమయం తీసుకున్న కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ కాలేదు. పుష్ప రాజ్ క్యారెక్టర్ ని పార్ట్ 1 కంటే గొప్పగా సుకుమార్ ఈ సీక్వెల్ గా చూపించబోతున్నాడని నమ్ముతున్నారు. ఇక పుష్ప సిరీస్ కి కొనసాగింపు కూడా ఉంటుందని గతంలో అల్లు అర్జున్ ఓ మూవీ ఈవెంట్ లో స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనేది చెప్పలేనని క్లారిటీ ఇచ్చారు.

పుష్ప పార్ట్ 3పై అప్పటి నుంచి ఊహాగానాలు నడుస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కన్ఫర్మ్ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఈ సినిమా కథపై చర్చలు అయ్యాయంట. కథ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పారంట. పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లోనే పుష్ప 3కి సంబందించిన లీడ్ ఇచ్చే అవకాశం ఉందంట. దాని తర్వాత అఫీషియల్ ప్రకటన కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా పుష్పరాజ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.

అయితే పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ సినిమా పౌరాణిక కథాంశంతో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా అల్ల్లు అర్జున్ ఒక మూవీ చేయనున్నారు. అలాగే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఇవన్నీ అయ్యాక పుష్ప3 మూవీని సుకుమార్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. ఈ లోపు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండతో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.