సంక్రాంతికి సరికొత్తగా పుష్పరాజ్ తగ్గేదేలే..!
సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ నుండి ఈ రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 7 Jan 2025 1:20 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. 32 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. ఇక హిందీలో బన్నీ సినిమా కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ లో నెం.1 మూవీగా అవతరించింది. అయితే 'పుష్ప 2' సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి మేకర్స్ న్యూ స్ట్రాటజీతో వస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ సరికొత్తగా థియేటర్లలోకి రాబోతున్నాడు.
''పుష్ప 2: ది రూల్'' సినిమాకి 20 నిమిషాల అదనపు ఫుటేజ్ ను యాడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ నుండి ఈ రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ది వైల్డ్‌ఫైర్ మరింత మండుతుందని పేర్కొంటూ అల్లు అర్జున్ వైల్డ్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. క్రిస్మస్ నుంచే అదనంగా సీన్స్ కలుపుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓటీటీలో అన్ కట్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తారని అనుకున్నారు. అయితే పొంగల్ సందర్భంగా రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
'పుష్ప 2' సినిమాకి అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ జోడించడం వల్ల రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి దాకా సినిమా చూడని వాళ్ళు థియేటర్లకు తరలి వస్తారు. ఆల్రెడీ మూవీ చూసేసినవారికి ఏయే సీన్స్ యాడ్ చేసారో చూద్దామనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా పుష్పరాజ్ కు ఇది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే ఇది సంక్రాంతి సినిమాలపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. పండక్కి తెలుగులో 'గేమ్ చేంజర్' 'డాకు మహారాజ్' 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పోల్చుకుంటే అల్లు అర్జున్ సినిమాకి తక్కువ టికెట్ రేట్లు ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆప్షన్ గా మారొచ్చు.
'పుష్ప 2: ది రూల్' సినిమా 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో 20 నిముషాలు కలిపితే, 3 గంటల 40 నిమిషాల సినిమా అవుతుంది. నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు కాస్త బోరింగ్ ఫీల్ అవుతారని కూడా అనుకోవచ్చు. కాకపోతే పుష్పరాజ్ క్యారక్టర్ తో కనెక్ట్ అయిన వాళ్ళు లెన్త్ పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. రీలోడెడ్ వెర్షన్ క్లిక్ అయితే వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 'దంగల్' మూవీ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయని ఐకాన్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం.. బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 'పుష్ప 2: ది రూల్' సినిమా తెరకెక్కింది. ఇది 2021లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహాద్ పాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ, తారక్ పొన్నప్ప, జగదీశ్, దివి, అజేయ్, శ్రీతేజ్, మైమ్ గోపి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.