Begin typing your search above and press return to search.

దేవర లెక్కలు పెంచేసిన పుష్ప రాజ్

ఈ గ్యాప్ రావడంతో పబ్లిక్ అటెన్షన్ కూడా పెరుగుతుందని డిస్టిబ్యూటర్స్ గ్రహించి దేవర థీయాట్రికల్ రైట్స్ ని మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసారంట.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:15 AM GMT
దేవర లెక్కలు పెంచేసిన పుష్ప రాజ్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందుగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైం పట్టేలా ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. పుష్ప2 వాయిదా పడటంతో ఆ డేట్ కి పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే ఈ పుష్ప 2 వాయిదా దేవర మూవీకి బిజినెస్ పరంగా ప్లస్ అయ్యిందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

ఓజీ మూవీ వాయిదా పడటంతో దేవర ఆ డేట్ ని ఉపయోగించుకుంది. ఇలా రెండు వారాలు ముందుకి దేవర రిలీజ్ రావడంతో సినిమాకి బిజినెస్ పరంగా చాలా ప్లస్ అయ్యిందని టాక్. ఇదే సమయంలో పుష్ప 2 వాయిదా పడటం కూడా కలిసొచ్చిందంట. కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆ తరువాత మళ్ళీ సెప్టెంబర్ వరకు పెద్ద సినిమాలేవీ కూడా రిలీజ్ కి లేవు. మధ్యలో డబుల్ ఇస్మార్ట్ ఉన్న పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

ఈ గ్యాప్ రావడంతో పబ్లిక్ అటెన్షన్ కూడా పెరుగుతుందని డిస్టిబ్యూటర్స్ గ్రహించి దేవర థీయాట్రికల్ రైట్స్ ని మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసారంట. దీంతో ఆంధ్రాలో 50-55 కోట్ల మధ్యలో దేవర మూవీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు టాక్. అలాగే నైజాంలో 45 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయంట. సీడెడ్ లో 23 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

ఈ లెక్కన చూస్తుంటే దేవర సినిమాకి అదనంగా 50+ కోట్ల వరకు బిజినెస్ ద్వారా వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది. దేవర మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. వీరిద్దరి కారణంగా నార్త్ లో కూడా దేవరకి సాలిడ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మరి దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.