Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ పై అప్పుడే ట్రోలింగా..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని మీమర్స్, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు

By:  Tupaki Desk   |   24 April 2024 11:30 PM GMT
పుష్పరాజ్ పై అప్పుడే ట్రోలింగా..
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని మీమర్స్, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న పుష్ప ది రూల్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అప్పుడే ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.

మే 1న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో 20 సెకండ్స్ ఉంది. ఐకాన్ స్టార్ అభిమానులకి అయితే ఈ ప్రోమో బాగా కనెక్ట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పుష్పరాజ్ ప్రోమోపై అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది.

స్నేహితుడు సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్ ని పుష్ప సాంగ్ ప్రోమోకి యాడ్ చేసి వీడియోగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. కనీసం సాంగ్ పూర్తిగా వినకుండానే పుష్ప ఫస్ట్ సింగిల్ ని ట్రోల్ చేయడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఇలా ట్రోలింగ్ చేసి సాంగ్ పై నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

పుష్ప సినిమాలో సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ సృష్టించాయి. ఈ సాంగ్స్ ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సాంగ్స్ కి గాను దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పుష్ప ది రూల్ మూవీ నుంచి అంతకు మించి బెస్ట్ సాంగ్స్ ఇచ్చే ప్రయత్నం దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు. అలాగే పూర్తి సాంగ్ రాకముందే ఈ రకమైన ట్రోల్స్ కరెక్ట్ కాదని మరికొందరు కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రాగానే ట్రోలింగ్ మొదలు పెట్టడం వెనుక యాంటీ ఫ్యాన్స్ హస్తం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొదటి పాట వచ్చే వరకు కూడా వేచి చూడకుండా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. మరి ఈ ట్రోలింగ్ పైన చిత్ర యూనిట్ ఏమైనా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. ఇక పుష్ప సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.