Begin typing your search above and press return to search.

సూసేకి సౌండ్.. ఇంకా గట్టిగానే..

ఇప్పటి వరకు 175 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అందులో తెలుగు వెర్షన్ నుంచే 100 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   19 July 2024 11:37 AM GMT
సూసేకి సౌండ్.. ఇంకా గట్టిగానే..
X

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి.. అంటూ సాగే పుష్ప-2 మూవీలోని సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఇప్పటికీ ఆ పాటకు రీల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. సాంగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జోడీగా వేసిన స్టెప్పులు ప్రతి జంటక కొత్త అండ్ స్పెషల్ డ్యాన్స్ మూవ్ అందించిందని కచ్చితంగా చెప్పాలి.

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ కు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పుష్ప మూవీలోని శ్రీవల్లి పాట ఎలాంటి హిట్ అయిందో.. సూసేకి సాంగ్ కూడా అలాంటి రెస్పాన్సే అందుకుంది. మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ పాడిన ఆ పాట బీట్.. ప్రతి ఒక్కరు లేచి స్టెప్పులేసేలా ఉంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బన్నీ, రష్మికతో ఆయన వేయించిన స్టెప్పులు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోవడం పక్కా.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీలో రిలీజ్ అయిన సూసేకి సాంగ్.. సోషల్ మీడియాలో ఇప్పటికీ అలరిస్తోంది. ఇప్పటి వరకు 175 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అందులో తెలుగు వెర్షన్ నుంచే 100 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. పుష్ప 2 దే ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప మాస్ బీట్ తో అలరించగా.. సూసేకి సాంగ్ మాత్రం మెలోడీ లవర్స్ ను ఓ రేంజ్ లో కట్టిపడేసిందనడంలో డౌట్ అక్కర్లేదు.

అల్లు అర్జున్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప -2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ గురించి ఇటీవల రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవేం నిజం కావని క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు చిత్రీకరణ, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 6వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి పుష్ప-2 మూవీ.. ఎలాంటి హిట్ అవుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.