Begin typing your search above and press return to search.

పుష్ప 2.. మళ్ళీ ఈ డౌటేంటి?

తాజాగా కొన్ని సీన్లను తిరిగి షూట్ చేయడం వల్ల, VFX పనులు ఆలస్యం కావడం వల్ల, ప్రస్తుతం షూటింగ్ ప్రక్రియ జూలై వరకు కొనసాగనుంది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 1:30 PM GMT
పుష్ప 2.. మళ్ళీ ఈ డౌటేంటి?
X

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా రోజులుగా సుక్కు టీమ్ రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు అల్లు అర్జున్ జూన్ మధ్య నాటికి కఠినమైన డెడ్‌లైన్ విధించారు. కానీ చిత్రబృందం షూటింగ్ పూర్తిచేయడానికి ఇంకా ఒక నెల సమయం అవసరమని మళ్ళీ కొత్త గాసిప్ పుట్టుకొస్తోంది. సుకుమార్ తన టీమ్ తో కలిసి కొన్ని ఎపిసోడ్‌లను తిరిగి డిజైన్ చేసి, ఇటీవల షూట్ చేశారు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా 1000 కోట్ల మార్కెట్ ను అందుకోవాలి అని అల్లు అర్జున్ చాలా కసిగా ఉన్నాడు. ఇక సుకుమార్ తో పాటు నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే దాదాపు తుది దశకు చేరుకుంది. చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ ఇటీవలే తన డేట్స్ కేటాయించడంతో ఆయన పాత్రల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది.

ఈ చిత్ర ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నవీన్ నూలి ఎడిట్ పనుల్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ ఇప్పటి వరకు వీఎఫ్ఎక్స్ పనితీరుతో సంతృప్తి చెందకపోవడం, వాటి పూర్తి చేయడానికి ఎక్కువ సమయం కావడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతోందని టాక్ వైరల్ అవుతోంది.

షెడ్యూల్ ప్రకారం, పుష్ప 2: ది రూల్ చిత్రీకరణ జూలై చివరి వరకు కొనసాగనుంది. ఇటీవలి పరిణామాల ప్రకారం, ఈ చిత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 15న విడుదల కావడం అసాధ్యంగా కనిపిస్తోంది. సుకుమార్ మీద నిర్మాతలు కొంత ఒత్తిడి పెడుతున్నారు కానీ సినిమా ప్రకటించిన తేదీకి విడుదల కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అల్లు అర్జున్ మాత్రం టీమ్‌ను వేగంగా పని చేసి, సమయానికి పూర్తి చేయాలని కోరుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పుష్ప 2: ది రూల్ అనుకున్న సమయానికి థియేటర్స్ లోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోందట. తాజాగా కొన్ని సీన్లను తిరిగి షూట్ చేయడం వల్ల, VFX పనులు ఆలస్యం కావడం వల్ల, ప్రస్తుతం షూటింగ్ ప్రక్రియ జూలై వరకు కొనసాగనుంది. ఎడిటర్ మార్పులు మరియు VFX పనులు పూర్తి చేయడానికి ఇంకా సమయం కావడం వల్ల, ఈ చిత్రాన్ని సమయానికి విడుదల చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని గాసిప్స్ మొదలయ్యాయి.

మరింత ఆలస్యమైతే ప్రేక్షకులు నిరాశ చెందుతారేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కూడా సినిమాను ప్రకటించిన సమయానికి విడుదల చేయాలని కృషి చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల తేదీకి సినిమా రెడీ కావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.