Begin typing your search above and press return to search.

పుష్ప 2 సైడ్ ఇస్తే.. కాచుకొని ఉన్నారు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ మూడేళ్ళ నుంచి షూటింగ్ స్టేజ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:06 AM GMT
పుష్ప 2 సైడ్ ఇస్తే.. కాచుకొని ఉన్నారు..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ మూడేళ్ళ నుంచి షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు పుష్పరాజ్ ని ఇష్టపడే వారు కూడా వెయిట్ చేస్తున్నారు. హిందీలో పుష్ప ది రూల్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పెర్ఫెక్ట్ గా మూవీని చెక్కే పనిలో ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సుకుమార్, బన్నీకి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

సినిమా షూటింగ్ ఎక్కువ టైం తీసుకోవడం వలన బన్నీ డిజప్పాయింట్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్నీ వాస్ ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. పుష్ప 2 ఎడిటింగ్ పైన ప్రస్తుతం సుకుమార్ ఉన్నారని తెలిపారు. ఇంకా బన్నీకి సంబందించిన సీక్వెల్స్ షూట్ 15 రోజులు మాత్రమే ఉన్నాయని. మెజారిటీ సీన్స్ ఫాహద్ ఫాజిల్ కి సంబందించినవి తెరకెక్కించాల్సి ఉందని తెలిపారు. నెల రోజుల ఫ్యామిలీ ట్రిప్ కోసం బన్నీ కాస్తా ట్రిమ్ చేసుకున్నారని తెలిపారు.

అల్లు అర్జున్ నెక్స్ట్ షెడ్యూల్ కి చాలా టైం ఉందని, ఆ లోపు మళ్ళీ పుష్ప లుక్ లోకి తిరిగొస్తారని క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ మరో ఆరు నెలలు షూటింగ్ ఉంటుందని చెప్పిన అల్లు అర్జున్ చేస్తాడని బన్నీ వాస్ చెప్పాడు. దీంతో ఆల్ మోస్ట్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లే. సెప్టెంబర్ నాటికి పుష్ప ది రూల్ షూటింగ్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉందంట. డిసెంబర్ 6న రిలీజ్ పక్కా అని భావిస్తున్నారు. ఏవైనా కారణాల వలన పుష్ప ది రూల్ వాయిదా పడితే ఆ డేట్ లో రావడానికి ఇద్దరు స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. అలాగే మరో రెండు సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట.

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ లో మూవీ రిలీజ్ ఉంటుందని తాజాగా కన్ఫర్మ్ చేశారు. అయితే డేట్ ఫిక్స్ చేయలేదు. పుష్ప 2 వాయిదా పడితే ఆ డేట్ కి కన్నప్ప తీసుకురావాలని అనుకుంటున్నాడంట. ఒక వేళ పుష్ప 2 రిలీజ్ అదే టైంకి ఉంటే మరో డేట్ ని డిసెంబర్ లోనే ఫిక్స్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్

అలాగే నందమూరి నటసింహ బాలకృష్ణ NBK 109 సినిమా షూటింగ్ దశలో ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీని డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వీరు కూడా పుష్ప 2 వాయిదా పడుతుందనే హాప్ తో ఉన్నారు. ఒకవేళ డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కచ్చితంగా వస్తుంది అనుకుంటే NBK109 రిలీజ్ డేట్ పై మేకర్స్ పునరాలోచన చేసే అవకాశం ఉందంట.