పుష్పరాజ్ స్నేహితుడు అరెస్ట్ వెనుక ఏమి జరిగింది అంటే!
పుష్ప- పలాస 1978 లాంటి చిత్రాల్లో కథానాయకుడి స్నేహితుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న సహాయ నటుడు జగదీష్ ని ఓ షాకింగ్ ఘటనలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 7 Dec 2023 4:37 AMపుష్ప- పలాస 1978 లాంటి చిత్రాల్లో కథానాయకుడి స్నేహితుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న సహాయ నటుడు జగదీష్ ని ఓ షాకింగ్ ఘటనలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన మహిళ ఆత్మహత్యలో అతడి ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేధింపుల కారణంగా మానసిక క్షోభకు గురై గత నెల 29న విషాదకరంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆత్మహత్యకు జగదీష్ కారణమని ప్రాథమికంగా గుర్తించారు. జగదీష్ చాలా రోజులుగా అధికారులనుంచి తప్పించుకుంటున్నాడు.. కానీ చివరికి అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
జగదీష్‌కు సినీ పరిశ్రమలో ఉన్న సంబంధాల ద్వారా సదరు జూనియర్ ఆర్టిస్ట్ (మహిళ)తో పరిచయం ఏర్పడినట్లు వెల్లడైంది. జగదీష్ సదరు మహిళను బెదిరించడంతో కాన్ సీక్వెన్సెస్ బయటపడ్డాయి. జగదీష్ ప్రతిభావంతుడైన వర్థమాన నటుడు. కెరీర్ పరంగా ఎదుగుతున్నాడు. కానీ ఇలాంటి ఒక ఘటనలో అతడు పట్టుబడటం పరిశ్రమలో షాక్ వేవ్ గా మారింది.
మల్లేశం -జార్జ్ రెడ్డి-పలాస 1978 వంటి చిత్రాలలో తన సహాయక పాత్రలతో అతడికి మంచి గుర్తింపు దక్కింది. పాన్-ఇండియా చిత్రం `పుష్ప`లో అల్లు అర్జున్ స్నేహితుడిగా చిరస్మరణీయమైన పాత్రను పోషించాడు. అతడి అరెస్ట్ ఆకస్మిక ఘటనలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ప్రస్తుతం అతడు `పుష్ప 2`లో నటిస్తున్నాడు. తాజా ఘటన పుష్ప టీమ్ కి కూడా ఇది ఇబ్బందికర సన్నివేశం.