Begin typing your search above and press return to search.

తొలి చూపులోనే ప‌డిపోయాను: పి.వి.సింధు

అయితే టెక్ గురూతో పి.వి.సింధు ప్రేమాయ‌ణం గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 2:45 PM GMT
తొలి చూపులోనే ప‌డిపోయాను: పి.వి.సింధు
X

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్ ప‌త‌కాన్ని భార‌త్ కి అందించిన బ్యాడ్మింట‌న్ స్టార్ PV సింధు, హైద‌రాబాద్ కి చెందిన‌ పోసిడెక్స్ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. వివాహ వేడుక జరిగిన రెండు రోజుల తర్వాత పెళ్లి ఫోటోలు విడుద‌ల‌య్యాయి. అయితే టెక్ గురూతో పి.వి.సింధు ప్రేమాయ‌ణం గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

వోగ్ ఇండియా క‌థ‌నం ప్రకారం.. అక్టోబర్ 2022లో ఒక విమానంలో ఈ ఇద్ద‌రికీ తొలి ప‌రిచ‌యం అయింది. తొలి చూపులోనే ఆల్మోస్ట్ పి.వి.సింధు ప్రేమ‌లో ప‌డిపోయార‌ట‌. విమానంలో అత‌డి ప‌రిచ‌యంతో అంతా మారిపోయంద‌ని సింధు వెల్ల‌డించింది. ''ఆ ప్రయాణం మమ్మల్ని దగ్గర చేసింది. తార‌లు ఒక దరికి చేర‌డం యాధృచ్ఛికం. ఇది దాదాపు మొదటి చూపులో ప్రేమ వంటిది. ఆ క్షణం నుండి ప్రతిదీ సరిగ్గానే ఉంద‌ని అనిపించింది'' అని సింధు తెలిపింది.

ఈ జంట‌ నిశ్చితార్థం సింపుల్ గా కొద్దిమంది బంధుమిత్రుల మ‌ధ్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యమైన బంధుమిత్రుల మ‌ధ్య‌ ఈ ప్ర‌త్యేక‌ వేడుక‌ను జరుపుకోవడం ఉద్వేగభరితమైనది.. అర్థవంతమైనది అని పివి సింధు అన్నారు. ''మా పెళ్లిని ప్లాన్ చేసుకోవడం ఒక అందమైన స‌వాల్‌తో కూడుకున్న ప్రయాణం'' అని కూడా సింధు అన్నారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ వివాహం కోసం ప్ర‌తిదానిపైనా స్ప‌ష్ఠంగా ఉన్నాం. ప్రతిదీ నిశితంగా ప్లాన్ చేసాను. సజావుగా అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగేలా, నా కలలకు ప్రాణం పోసేలా చేసారు సాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి అంశం మా ప్రేమ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా, వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా చూసుకున్నాము.. అని సింధు తెలిపారు.