Begin typing your search above and press return to search.

ఉత్తరాదికి వరం.. సౌత్ ఏం పాపం చేసింది పీవీఆర్ ఐనాక్స్?

పీవీఆర్ ఐనాక్స్. మన దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఈ తరహా ఆఫర్ ను ప్రకటించారని చెప్పాలి.

By:  Tupaki Desk   |   15 Oct 2023 9:50 AM IST
ఉత్తరాదికి వరం.. సౌత్ ఏం పాపం చేసింది పీవీఆర్ ఐనాక్స్?
X

అదిరే ఆఫర్ ను వెల్లడించింది దేశంలోనే అతి పెద్ద మల్టీఫ్లెక్స్ ఛైన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్. మన దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఈ తరహా ఆఫర్ ను ప్రకటించారని చెప్పాలి. మూవీ లవ్వర్స్ కు బంఫర్ ఆఫర్ ను ప్రకటించిన పీవీఆర్ ఐనాక్స్.. సదరు ఆఫర్ ను కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం చేసిన వైనం చూసినప్పుడు మాత్రం ఒళ్లు మండక మానదు. ఓటీటీ జోరు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. దానికి సవాలు విసిరేలా తాజా ఆఫర్ ఉందని చెబుతున్నారు.

నెల వ్యవధిలో పది సినిమాల్ని వెండి తెర మీద వీక్షించేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ.. అందుకు కేవలం రూ.699 మాత్రమే వసూలు చేయనున్నట్లుగా పీవీఆర్ పేర్కొంది. అయితే.. ఈ ఆఫర్ ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం చేయటం గమనార్హం. దేశంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి చెందిన ప్రజలే సినిమాల్ని విపరీతంగా చూస్తారు. సౌత్ ప్రజల జీవితాల్లో సినిమా ఒక భాగం. ఈ కారణంగానే సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.

పీవీఆర్ ఐనాక్స్ లాంటి సంస్థ ఒక భారీ ఆఫర్ పు ప్రకటించినప్పుడు.. దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయటం సరికాదన్న వాదనను మూవీ లవర్స్ చేస్తున్నారు. అందునా.. ఇలాంటి ఆఫర్ ను సినిమాను విపరీతంగా ప్రేమించే వారికి దక్కుండా చేయటం సరికాదని చెప్పాలి. ఏమైనా.. నార్త్ కు ఇచ్చే ఆఫర్ సౌత్ కు ఎందుకు ఇవ్వరు? అన్న ప్రశ్న పీవీఆర్ ను ఇబ్బందికి గురి చేయటం ఖాయమని చెప్పక తప్పదు.