Begin typing your search above and press return to search.

25 ఏళ్ల‌గా ఆ హీరో అదే భ‌యంతోనా!

నా కెరీర్ లో రెండే న‌రాలు తెగే ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. సినిమా షూటింగ్ కి వె ళ్లిన మొద‌టి రోజు ఒక‌టైతే అదే సినిమా రిలీజ్ అవుతున్న‌ది రెండ‌వ కార‌ణం న‌న్ను కుదురుగా కూర్చోనివ్వ‌వు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 5:19 AM GMT
25 ఏళ్ల‌గా ఆ హీరో అదే భ‌యంతోనా!
X

సినిమా పూర్తి చేసిన త‌ర్వాత ఫ‌లితం కోసం హీరో ప‌రీక్ష రాసిన విద్యార్ధిలా ఎదురు చూస్తుంటాడు. రిలీజ్ అనంత‌రం ఆ ఫ‌లితం అనుకూలంగా ఉండాల‌ని ఈ మ‌ధ్య‌లో ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆ ఫ‌లితం పాజిటివ్ గా వ‌స్తే సంతోషం లేదంటే దుఖం త‌ప్ప‌దు. తాజాగా మాధ‌వ‌న్ సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆయ‌న ఎలాంటి అనుభూతికి లోన‌వుతారో రివీల్ చేసారు. `మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా థియేట‌ర్లో రిలీజ్ అవుతుందంటే భ‌యాందోళ‌న‌కు గుర‌వుతాను.

నా కెరీర్ లో రెండే న‌రాలు తెగే ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. సినిమా షూటింగ్ కి వె ళ్లిన మొద‌టి రోజు ఒక‌టైతే అదే సినిమా రిలీజ్ అవుతున్న‌ది రెండ‌వ కార‌ణం న‌న్ను కుదురుగా కూర్చోనివ్వ‌వు. రిలీజ్ రోజు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సినిమా హిట్ అయితే ఎలా మాట్లాడుకుంటారు? ప్లాప్ అయితే ఎలా స్పందిస్తారు? అనే టెన్ష‌న్ ఉంటుంద‌న్నారు. ప్లాప్ అయితే నీ గేమ్ ఓవ‌ర్ అనే మాట‌కు తానెంతో భ‌య‌ప‌డ‌తాన‌న్నారు.

అలాంటి ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా 25 ఏళ్ల‌గా కొన‌సాగ‌డం చిన్న విష‌యం కాదంద‌న్నారు. కొంద‌రు 25 నెల‌ల్లోనే అవ‌కా శాలు కోల్పోతారు..ఆ విష‌యంలో తానెంతో అదృష్టవంతుడిని అన్నారు. కోట్లాది మంది అభిమానంతోనే నేడు ఆస్థాయిలో ఉన్నాన‌న్నారు. అలాగే కొన్నిసార్లు స్టోరీ ఆధారంగా నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు చేయాల్సి ఉంటుంద‌న్నారు. అలాంటివి థియేట‌ర్లో రిలీజ్ కంటే ఓటీటీలోనే బాగుంటుంద‌న్నారు.

అలాంటి త‌న ప్రాజెక్ట్ లు కొన్ని మంచి ఫ‌లితాలు సాధించాయ‌న్నారు. అలా హిట్ కంటెంట్ ని నిడివి త‌గ్గించి థియేట‌ర్లో రిలీజ్ చేస్తే స‌రైన ఫ‌లితాలు రావు. ప్రేక్ష‌కుడికి ఆ క‌థ అసంపూర్ణంగా అనిపిస్తుంది. అందుకే నిడివి ఎక్కువైతే ఓటీటీనే బెట‌ర్ ఆప్ష‌న్ గా మాధ‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. మాధ‌వ‌న్ న‌టించిన `హిసాబ్ బ‌రాబ‌ర్` జీ5లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.