Begin typing your search above and press return to search.

'రా మచ్చా మచ్చా' సాంగ్‌.. ట్రెండ్ సెట్ చేస్తోందిగా..

అలాగే వందలాది జానపద కళాకారులు కూడా ఈ పాటలో పాల్గొనడం విశేషం.

By:  Tupaki Desk   |   1 Oct 2024 12:02 PM GMT
రా మచ్చా మచ్చా సాంగ్‌.. ట్రెండ్ సెట్ చేస్తోందిగా..
X

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి వచ్చిన రెండో సింగిల్ 'రా మచ్చా మచ్చా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 24 గంటల్లోనే ఈ సాంగ్ 19.5 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని, టాలీవుడ్‌లో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోలో ఒకటిగా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పవచ్చు.


ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కి అనంత శ్రీరామ్, వివేక్, కుమార్ లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్ అద్భుతంగా పాడిన ఈ పాట, గణేష్ ఆచార్య రూపొందించిన కొరియోగ్రఫీతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అభిమానులను మెస్మరైజ్ చేశాడు. అలాగే పాటలో ప్రధానంగా రామ్ చరణ్ 'వీణ స్టెప్' చేయడం, మెగాస్టార్ చిరంజీవి కటౌట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

అలాగే వందలాది జానపద కళాకారులు కూడా ఈ పాటలో పాల్గొనడం విశేషం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాటలో భాగమవడం పాటకు మరింత హైప్ తెచ్చింది. ప్రతీ ఎలిమెంట్ ఈ సాంగ్‌కి అద్భుతమైన విజయం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

అభిమానులు పాటను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సాంగ్ ఇన్ స్టంట్ హిట్ కావడంతో, ‘గేమ్ చేంజర్’ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఫైనల్ గా సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, తెలుగు నటి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

అలాగే, తమిళ స్టార్ నటుడు ఎస్ జే సూర్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'రా మచ్చా మచ్చా' సాంగ్ సక్సెస్‌తో అభిమానులలో హైప్ మరింత పెరిగింది. తమన్ మ్యూజిక్, శంకర్ దర్శకత్వం, రామ్ చరణ్ నటన, అన్నీ కలసి ‘గేమ్ చేంజర్’ మూవీని బిగ్ హిట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.