Begin typing your search above and press return to search.

రాయ్ ల‌క్ష్మి కిల్ల‌ర్ లుక్ వైర‌ల్

తాజా ఫోటోషూట్ లో బ్లాక్ సూట్ ధ‌రించి అందాల‌ను ఆరాంగా ఆర‌బోస్తోంది. ల‌క్ష్మీ రాయ్ తిరిగి ఫామ్ లోకి వ‌చ్చేసింది అంటూ అభిమానులు సంబ‌ర ప‌డుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 4:00 AM GMT
రాయ్ ల‌క్ష్మి కిల్ల‌ర్ లుక్ వైర‌ల్
X

రాయ్ ల‌క్ష్మి ఏం చేసినా స్పైసీగా ఉంటుంది. తాజాగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఈ కొత్త లుక్ క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. అభిమానులు లైక్ లు క్లిక్ ల‌తో హోరెత్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు పెంచుతోంది.

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత రాయ్ ల‌క్ష్మి న‌ట‌న ప‌రంగా ప్ర‌య‌త్నాల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. ఇటీవ‌ల ఈ భామ కేవ‌లం ఫోటోషూట్ల‌తో కాల‌క్షేపం చేస్తోంది. రాయ్ ల‌క్ష్మీ ఫోటోషూట్ల‌కు నెట్ లో బోలెడంత గిరాకీ ఉంది. తాజా ఫోటోషూట్ లో బ్లాక్ సూట్ ధ‌రించి అందాల‌ను ఆరాంగా ఆర‌బోస్తోంది. ల‌క్ష్మీ రాయ్ తిరిగి ఫామ్ లోకి వ‌చ్చేసింది అంటూ అభిమానులు సంబ‌ర ప‌డుతున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కాంచ‌న మాల కేబుల్ టీవీ చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన రాయ్ ల‌క్ష్మీ తెలుగు-త‌మిళంలో బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగింది. ఆ త‌ర్వాత‌ జూలీ 2తో బాలీవుడ్ లోను ప్ర‌వేశించింది. అయితే అక్క‌డ ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత‌ వెబ్ సిరీస్ పాయిజన్ 2లో న‌టించి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక‌ తమిళ సినిమాల్లోకి కర్కా కసదర తో రంగ ప్ర‌వేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పోలిస్తే తమిళ సినిమా రంగంలోనే ల‌క్ష్మీకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. జాతకాల పిచ్చి ఉన్న రాయ్ లక్ష్మి జ్యోతిష్కుల‌ను సంప్ర‌దించి స‌మ‌స్య‌లు లేని కాలం తర్వాత ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో తిరిగి ప్రవేశించింది.

అక్క‌డ‌ అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. వెండితెరపై తన అద్భుతమైన అందంతో ప్రేక్షకులను ఆకర్షించింది. రాయ్ లక్ష్మి గత సంవత్సరం ది లెజెండ్ చిత్రంలో అరుల్ శరవణన్‌తో కలిసి ఒక విలక్షణమైన పాటలో న‌ర్తించి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. రాయ్ ల‌క్ష్మీ తెలుగులో ఖైదీనంబ‌ర్ 150 లో ర‌త్తాలు సాంగ్ లో న‌ర్తించింది. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో అవ‌కాశాలొచ్చాయి.