పిక్‌టాక్ : అందాల రాయ్‌లక్ష్మి బికినీ షో
గతంలో లక్ష్మీ రాయ్ అంటూ పిలిపించుకున్న ఈ అమ్మడు లక్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకుంది.
By: Tupaki Desk | 8 Jan 2025 11:30 AM GMTరెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకులకు శ్రీకాంత్‌తో కలిసి రాయ్ లక్ష్మి 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. గతంలో లక్ష్మీ రాయ్ అంటూ పిలిపించుకున్న ఈ అమ్మడు లక్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకుంది. పేరు మార్చుకోవడం వల్లనో లేదా ఆమె అందం వల్లనో కానీ రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ అందమైన ముద్దుగుమ్మ అంటూ గుర్తింపు దక్కించుకుంది.
ఈమధ్య కాలంలో పవర్ ఫుల్ పాత్రల్లో, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్న రాయ్ లక్ష్మిని ప్రేక్షకులు అందాల ఆరబోత పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారు. గత ఏడాది ఒక సినిమాతో వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాది కనీసం రెండు మూడు సినిమాలతో వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. మరో వైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటిలాగే తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి రాయ్ లక్ష్మి చూపు తిప్పనివ్వని అందంతో ఫోటోలు షేర్ చేసి కన్నలు విందు చేసింది.
గతంలో చాలా సార్లు రాయ్ లక్ష్మి బికినీ ఫోటో షూట్‌ను షేర్ చేసింది. ఎప్పటికప్పుడు విభిన్నంగా, మరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తూ ఉంది. ఈసారి అంతకు మించి అంటూ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలు ఉన్నాయి. లైట్ పింక్ కలర్‌లో ఉన్న బికినీ ధరించిన స్టైలిష్ గాగుల్స్ ధరించిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అంటే నమ్మడానికి లేదు. ఆమె వయసు 20 ఏళ్లు అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగా ఉన్న ఈ అమ్మడు ఇరవై ఏళ్లుగా సినిమాలు ఎలా చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతుంది కనుక వయసు దాదాపుగా నాలుగు పదుల వయసుకు చేరువ అయ్యి ఉంటుంది. అయినా ఇంత అందం ఎలా సాధ్యం అంటూ చాలా మంది అవాక్కవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఈమె ఫోటోలకు వస్తున్న స్పందనతో మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.