Begin typing your search above and press return to search.

స్విట్జ‌ర్లాండ్‌లో ఒంట‌రిగా రాయ్ ల‌క్ష్మీ

ర‌త్తాలు బ్లాక్ బికినీ ధ‌రించి కాంబినేష‌న్ గాగుల్స్ తో మ‌తులు చెడ‌గొడుతోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 10:30 PM GMT
స్విట్జ‌ర్లాండ్‌లో ఒంట‌రిగా రాయ్ ల‌క్ష్మీ
X

రాయ్ ల‌క్ష్మి కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. అలాగ‌ని అస‌లు సినిమాల్లో న‌టించ‌డం లేదా? అంటే అలాంటిదేమీ లేదు. కెరీర్ ని చ‌క్క‌దిద్దుకుంటూనే, మ‌రోవైపు విదేశీ విహార యాత్ర‌లతోను బిజీగా ఉంది. తాజాగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో ఇది క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. ర‌త్తాలు ర‌చ్చ ర‌చ్చ అంటూ యూత్ దీనికి స్పందిస్తున్నారు.


ర‌త్తాలు బ్లాక్ బికినీ ధ‌రించి కాంబినేష‌న్ గాగుల్స్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఇక స్విట్జర్లాండ్ లోని అంద‌మైన స‌ర‌స్సుల్లో బోట్ షికార్లు చేస్తూ మ‌ర‌బోట్ పై ఫోటోషూట్ లోను పాల్గొంది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో రాయ్ ల‌క్ష్మీ వేడిగా క‌నిపిస్తోంది. అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం సంకోచించ‌ని రాయ్ ల‌క్ష్మీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయింది.


ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `కాంచ‌న మాల కేబుల్ టీవీ` చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన రాయ్ ల‌క్ష్మీ ద‌శాబ్ధంపైగానే సినీప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ న‌టిగా కొన‌సాగింది. జూలీ 2తో బాలీవుడ్ లోను ప్ర‌వేశించింది. అయితే అక్క‌డ ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత‌ వెబ్ సిరీస్ పాయిజన్ 2లో న‌టించి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక‌ తమిళ సినిమాల్లోకి కర్కా కసదర తో రంగ ప్ర‌వేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పోలిస్తే తమిళ సినిమా రంగంలోనే ల‌క్ష్మీకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. జాతకాల పిచ్చి ఉన్న రాయ్ లక్ష్మి జ్యోతిష్కుల‌ను సంప్ర‌దించి స‌మ‌స్య‌లు లేని కాలం తర్వాత ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో తిరిగి ప్రవేశించింది. అక్క‌డ‌ అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. వెండితెరపై తన అద్భుతమైన అందంతో ప్రేక్షకులను ఆకర్షించింది. రాయ్ లక్ష్మి గత సంవత్సరం ది లెజెండ్ చిత్రంలో అరుల్ శరవణన్‌తో కలిసి ఒక విలక్షణమైన పాటలో న‌ర్తించి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. పరిపూర్ణమైన నటన కంటే అందాల ఆర‌బోత‌కే ప్రాధాన్యతనిస్తూనే రాయ్ లక్ష్మి అవకాశాల్ని చేజిక్కించుకుంటోంది. అయితే ఇది త‌న ఎదుగుద‌ల‌కు ఎంత‌మాత్రం ఉప‌క‌రించ‌లేదు.