Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర‌ఫ్ఫాడించిన రాయ్ ల‌క్ష్మి

తాజాగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతోంది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 2:48 PM GMT
ఫోటో స్టోరి: ర‌ఫ్ఫాడించిన రాయ్ ల‌క్ష్మి
X

రాయ్ ల‌క్ష్మి ర‌ఫ్ఫాడించింది. కుర్ర‌కారుకు మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిచ్చింది. తాజాగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఇది క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. ఇన్ స్టా వేదిక‌ ల‌క్ష‌లాది లైక్ లు క్లిక్ ల‌తో హోరెత్తింది. ర‌త్తాలు టూ హాట్ గురూ అంటూ ఈ ఫోటోకి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.


టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అన్నిచోట్లా ఈ భామ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయి. కానీ ఎక్క‌డో చోట కుదురుగా సినిమాలు చేసుకునే ఛాన్స్ అయితే క‌నిపించ‌లేదు. దీనికి కార‌ణం న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాపుల‌వ్వ‌డ‌మే. ఇక అందాల ఆర‌బోత‌తో సంబంధం లేకుండా కంటెంట్ లేని ర‌త్తాలు సినిమాల్ని నిర్ధ్వంద్వంగా తిర‌స్క‌రించడంలో ప్రేక్ష‌కులు క‌నిక‌రం లేకుండా ప్ర‌వ‌ర్తించారు.

ఏది ఏమైనా రాయ్ ల‌క్ష్మీకి ఇప్పుడు సోష‌ల్ మీడియాలే దిక్కు. అందుకే ఈ వేదిక‌ల‌పై వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. అలాగే గ్యాప్ అన్న‌దే లేకుండా వ‌రుస‌గా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల ద్వారా ఆదాయం ఆర్జిస్తోంది.

రాయ్ ల‌క్ష్మీ హాట్ ఫోటోషూట్ల‌కు నెట్ లో బోలెడంత గిరాకీ. త‌ను షేర్ చేసే ప్ర‌తి ఫోటోగ్రాఫ్ యూత్ లోకి క్ష‌ణాల్లో వైర‌ల్ గా దూసుకెళుతుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన బికినీ షూట్ కుర్ర‌కారు గుండెల్లో అగ్గి రాజేసింది. రాయ్ ల‌క్ష్మీ టూమ‌చ్ హాట్ గా ఉందంటూ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు.

కెరీర్ గేమ్ ఇలా సాగింది: కాంచ‌న మాల కేబుల్ టీవీ చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన రాయ్ ల‌క్ష్మీ తెలుగు-త‌మిళంలో బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగింది. ఆ త‌ర్వాత‌ జూలీ 2తో బాలీవుడ్ లోను ప్ర‌వేశించింది. అయితే అక్క‌డ ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత‌ వెబ్ సిరీస్ పాయిజన్ 2లో న‌టించి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక‌ తమిళ సినిమాల్లోకి కర్కా కసదర తో రంగ ప్ర‌వేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పోలిస్తే తమిళ సినిమా రంగంలోనే ల‌క్ష్మీకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి.

జాతకాల పిచ్చి ఉన్న రాయ్ లక్ష్మి జ్యోతిష్కుల‌ను సంప్ర‌దించి స‌మ‌స్య‌లు లేని కాలం తర్వాత ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో తిరిగి ప్రవేశించింది. అక్క‌డ‌ అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. వెండితెరపై తన అద్భుతమైన అందంతో ప్రేక్షకులను ఆకర్షించింది. రాయ్ లక్ష్మి గత సంవత్సరం ది లెజెండ్ చిత్రంలో అరుల్ శరవణన్‌తో కలిసి ఒక విలక్షణమైన పాటలో న‌ర్తించి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. పరిపూర్ణమైన నటన కంటే అందాల ఆర‌బోత‌కే ప్రాధాన్యతనిస్తూనే రాయ్ లక్ష్మి అవకాశాల్ని చేజిక్కించుకుంటోంది. అయితే ఇది త‌న ఎదుగుద‌ల‌కు ఎంత‌మాత్రం ఉప‌క‌రించ‌లేదు.