Begin typing your search above and press return to search.

రాయ్ ల‌క్ష్మి రంజు రంజు లుక్!

రాయ్ లక్ష్మి టాలీవుడ్ కి దూర‌మై ఐదేళ్లు అవుతుంది. కంబ్యాక్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది గానీ ప‌న‌వ్వ‌లేదు.

By:  Tupaki Desk   |   8 July 2024 12:30 AM GMT
రాయ్ ల‌క్ష్మి రంజు రంజు లుక్!
X

రాయ్ లక్ష్మి టాలీవుడ్ కి దూర‌మై ఐదేళ్లు అవుతుంది. కంబ్యాక్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది గానీ ప‌న‌వ్వ‌లేదు. టాలీవుడ్ అనే కాదు..కోలీవుడ్..శాండిల్ వుడ్..మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏ భాష‌లోనూ నిల‌దొక్కుకోలేదు. స్థిరమైన అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌లో గుమ్మం తొక్కాల్సి వ‌చ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో బిజీగా ఉంది ఎప్పుడుంటే? 2019 లోనే.

ఆ ఏడాదే అమ్మ‌డు న‌టించిన ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఏడాదికి ఒక‌టి రెండు చొప్పున చేసింది. కానీ వాటిలో ఏది చెప్పుకోద‌గ్గ చిత్రం కాదు. ప్యాడింగ్ ఉన్న సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం మాలీవుడ్ లోనే ఓ సినిమా చేస్తుంది. కెరీర్ ప‌రంగా రాయ్ ల‌క్ష్మి ప్ర‌యాణం అలా సాగుతుంది. అయితే నెట్టింట మాత్రం అభిమానుల‌కు నిత్యం ట‌చ్ లోనే ఉంటుంది.

హాట్ హాట్ ఫోటోల‌తో హీటెక్కించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఇది రాయ్ ల‌క్ష్మిలో మొద‌టి నుంచి ఉన్న క్వాలిటీ. సినిమాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నా? ఇంకా యూత్ లో అటెన్ష‌న్ డ్రా చేస్తుందంటే? కార‌ణం ఆరక‌మైన ఫాలోయింగ్ అన్న‌ది చెప్పొచ్చు. తాజాగా అమ్మ‌డు స్విమ్మింగ్ పూల్ నుంచి ఓ హాట్ ఫోటో వ‌దిలింది. ఇందులో అమ్మ‌డు రెడ్ అండ్ వైట్ కాంబినేష‌న్ పీస్ లు ధ‌రించి పూల్ మ‌ధ్య‌లో బుక్ ప‌ట్టుకుని సీరియ‌స్ గా చ‌దివేస్తుంది.


చ‌ద‌వ‌డంలో ఆ సీరియ‌స్ చూసి ఈవిడేమైనా బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుందా? అన్న డౌట్ రావ‌డం సహజం. అలా అనుకుంటార‌నే అమ్మ‌డు ఈ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చేసింది. `నా జీవితంలోని ఈ అధ్యాయాన్ని ఆనందం అంటారు` అని రాసుకొచ్చింది. అంటే ఈత కొల‌నులో ఇలా రిలాక్స్ అవుతోన్న స‌మ‌యంలోనే అమ్మ‌డు అంత ఆనందంగా ఉంటుంద‌ని..మిగ‌తా క్ష‌ణాల‌న్నీ లైఫ్ బిజీ టెన్ష‌న్ లోనే ఉంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది.