అలాంటి వారితో స్నేహం చేయకండి: రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 4 March 2025 3:01 PM ISTఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా సక్సెస్ అవడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే పలు సినిమాల్లో నటించిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.
రీసెంట్ గా రాశీ ఖన్నా తమిళ సినిమా అఘాతియాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా రాశీ యాక్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ గురించి రాశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
మంచి ఫ్రెండ్స్ ను ఎంచుకునేటప్పుడు జీవితంలో తను నేర్చుకున్న విషయాల గురించి రాశీ ఆ వీడియోలో తెలిపింది. మనం మంచి వారితో స్నేహం చేసినప్పుడు మాత్రమే అన్నీ కరెక్ట్ గా ఉంటాయని, మిమ్మల్ని ప్రతీ విషయంలో ముందుకు నడిపించే వారితోనే స్నేహం చేయండి తప్పించి ఏం చేసినా కిందకు తోసే వారితో స్నేహం చేయొద్దని చెప్పిన రాశీ, తనకు చాలా గొప్ప స్నేహితులున్నారని, వారే తన బలమని తెలిపింది.
తన గురించి కంప్లైంట్ చేస్తూ, ఎప్పుడూ బిజీగా ఉన్నామని చెప్పే వ్యక్తులకు తన దగ్గర టైమ్ లేదని, పాజిటివిటీ ఉన్న వారితోనే తానెప్పుడూ ఉంటానని చెప్తోంది రాశీ. ఫ్రెండ్‌షిప్ విషయంలో రాశీ ముక్కు సూటితనం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా ఓ హీరోయిన్ గా నటించనుండగా శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతుంది.