పెళ్లి గురించి అడిగితే రాశీఖన్నా ఇలా తిరగబడిందేంటి?
త్వరలో సబర్మతి రిపోర్ట్ తో సంచలనం రేపడానికి రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 26 Oct 2024 7:30 PM GMTఅందాల రాశీఖన్నా కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఇతర భాషల్లో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్..బాలీవుడ్ అంటూ ఆ రెండు భాషల్ని టార్గెట్ చేసి ముందుకెళ్తుంది. అవకాశాలు వచ్చినంత కాలం టాలీవుడ్ లో బాగానే సినిమాలు చేసింది. కానీ సక్సెస్ లు లేకవడంతో అమ్మడు ఇక్కడ రేసులో వెనుకబడింది. అయినా? బాలీవుడ్ అక్కున చేర్చుకుని బాగానే అవకాశాలు కల్పిస్తోంది. త్వరలో సబర్మతి రిపోర్ట్ తో సంచలనం రేపడానికి రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమ్మడి ముందుకు పెళ్లి ప్రస్తావన వెళ్లింది. ఆమెని ఓ హోస్ట్ పెళ్లి గురించి అడడగా? కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్లు మాట్లాడింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని అంది. అయినా హోస్ట్ ఊరుకోలేదు. అమ్మడి నుంచి ఎలాగైన పెళ్లి సమాధానం రాబట్టలని పట్టు వదల్లేదు. దీంతో రాశీ చివరికి దిగొచ్చింది. తాను అందరి ఆడ పిల్లలాగే పెళ్లి చేసుకుని ..పిల్లలు కనాలనుకుంటున్నట్లు తెలిపింది.
కానీ అందుకు ఇంకా సమయం పడుతుందంది. ఇది నా వృత్తితో సంబంధం లేని చాలా వ్యక్తిగత నిర్ణయం. ఆ టాపిక్ గురించి చర్చ అనవసరం అన్నట్లు గా మాట్లాడింది. సాధారణంగా పెళ్లి గురించి అడిగితే ఎంత పెద్ద హీరోయిన్ అయినా? చాలా హుందాగా..సరదాగా సమాధానం ఇస్తుంటారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందనో? లేకపోతే సింగిల్ లైఫ్ ఇష్టపడతాననో చెబుతుంటారు. కానీ రాశీకన్నా మాత్రం పెళ్లి గురించి అడగడమే తప్పు అన్నట్లు భావించింది.
ప్రస్తుతం రాశీఖన్నా సబర్మతి రిపోర్టును బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేస్తుంది. ఏ ఈవెంట్ ని అమ్మడు మిస్ అవ్వడం లేదు. ఇందులో అమ్మడు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా హిట్ అయితే మంచి గుర్తింపు దక్కుతుంది. సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉంది. మేకర్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తోంది.