Begin typing your search above and press return to search.

లండన్ వీధుల్లో రాశీ ఖ‌న్నా దుమారం

పెద్ద తెర‌, ఓటీటీ రెండు చోట్లా అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 2:47 PM GMT
లండన్ వీధుల్లో రాశీ ఖ‌న్నా దుమారం
X

టాలీవుడ్ టు బాలీవుడ్ రాశీఖ‌న్నా జ‌ర్నీ గురించి తెలిసిన‌దే. ఇక్క‌డ అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకుంటున్న రాశీ ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌పైనా గురి పెట్టింది. అక్క‌డ షాహిద్ లాంటి స్టార్ స‌ర‌స‌న న‌టించింది. పెద్ద తెర‌, ఓటీటీ రెండు చోట్లా అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది. మ‌రోవైపు త‌మిళంలోను ఈ బ్యూటీ న‌టిస్తోంది.


హిందీలో వ‌రుసగా ప్ర‌యోగాలు చేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం `ట్వ‌ల్త్ ఫెయిల్` న‌టుడు విక్రాంత్ మాస్సేతో క‌లిసి మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తోంది. ఇది నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోంది.గుజ‌రాత్ అల్ల‌ర్లు, గోద్రాలో స‌బ‌ర్మ‌తి ట్రెయిన్ ద‌హ‌నం నేప‌థ్యంలో రూపొందుతున్న `ది సబర్మతి రిపోర్ట్` త‌న కెరీర్ లో పెద్ద మ‌లుపునిస్తుంద‌ని రాశీ భావిస్తోంది. గోద్రా సంఘటన, గుజరాత్ అల్లర్ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. గ‌తంలో IPS ఆఫీసర్ మనోజ్ శర్మగా నటించిన విక్రాంత్ మాస్సే ది సబర్మతి రిపోర్ట్‌లో హిందీ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు. విక్రాంత్- రాశితో పాటు, జవాన్ నటుడు రిద్ధి డోగ్రా కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం 3 మే 2024న భారీ స్క్రీన్ ల‌లో విడుదల కానుంది. షాహిద్ తో యోధ త‌ర్వాత రాశీకి ఇది మ‌రో క్రేజ ఆఫ‌ర్.


మ‌రోవైపు తెలుగులో తెలుసు క‌దా, త‌మిళంలో మేధావి చిత్రాల్లోను రాశీ న‌టిస్తోంది. టిఎంఇ అనే హిందీ చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాల‌న్నీ రిలీజ్ ల‌కు వ‌చ్చే లోపు రాశీ వ‌రుస ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లు యువ‌త‌రంలో గుబులు పుట్టిస్తున్నాయి. ప్ర‌స్తుతం లండ‌న్ ట్రిప్ నుంచి కొన్ని అరుదైన క్లిక్స్ ని షేర్ చేస్తోంది. అక్క‌డ మిట్ట మ‌ధ్యాహ్నం విహారంలో ఉన్నప్ప‌టి ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. పూర్తిగా ఉలెన్ కోట్ తో క‌ప్పుకుని, రాశీ స్టైలిష్ లుక్ లో క‌నిపించింది. లండ‌న్ లో చ‌లి వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకునేందుకు ఈ భామ స్పెష‌ల్ కేర్ తీసుకుంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది. లండ‌న్ లో రాశీ రియ‌ల్ క్వీన్ ని త‌ల‌పిస్తోందంటూ అభిమానులు ఈ లుక్ కి కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.