మార్వల్ క్వీన్‌లా రాశీ ఖన్నా స్టైల్!
ఈ బ్యూటీ డిజైనర్ దుస్తుల ఎంపిక రియల్లీ ఇంప్రెస్సివ్! అంటూ పొగిడేస్తోంది యూత్. ఇంతకుముందు వంగపువ్వు రంగు ఫ్రాకులో గుబులు రేపిన రాశీ ఇటీవల ఫోటోషూట్ల పరంగా అంతకంతకు వేడి పెంచేస్తోంది.
By: Tupaki Desk | 26 Nov 2024 4:51 PM GMTఅవును.. చూస్తుండగానే ఎంత మార్పు? తెలుగు సినీపరిశ్రమలో దశాబ్ధం కెరీర్ ని విజయవంతంగా రన్ చేసిన రాశీ ఖన్నా తమిళం, హిందీలోను నటిస్తోంది. ఇటీవల రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ 'ఫర్జీ'లో నటించాక ఇమేజ్ మరింత పెరిగింది. చూస్తుండగానే రాశీ హాలీవుడ్‌కి జంప్ అయ్యేట్టే ఉంది.
రోమ్ వెళితే రోమన్ లా ఉండాలని భావించిందో ఏమో కానీ, ఇప్పుడు గెటప్ మొత్తం మార్చేసింది ఈ దిల్లీ బ్యూటీ. చూస్తుండగానే సూపర్ ఉమెన్ గా మారింది. ఈ లుక్కు చూడగానే యాక్షన్ క్వీన్ ని తలపిస్తోంది. రాశీ స్టన్నర్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో డిబేటబుల్ గా మారింది. ప్రొఫెషనల్ ఫోజ్ ఎరా.. ఆల్వేస్ ఆన్ డ్యూటీ! అంటూ ఈ ఫోటోషూట్ ని షేర్ చేసింది రాశీ.
ఈ బ్యూటీ డిజైనర్ దుస్తుల ఎంపిక రియల్లీ ఇంప్రెస్సివ్! అంటూ పొగిడేస్తోంది యూత్. ఇంతకుముందు వంగపువ్వు రంగు ఫ్రాకులో గుబులు రేపిన రాశీ ఇటీవల ఫోటోషూట్ల పరంగా అంతకంతకు వేడి పెంచేస్తోంది. ప్రియాంక చోప్రా, సమంత బాటలోనే ఈ అమ్మడు కూడా కొత్తగా ప్లాన్ చేస్తోందని అర్థమవుతోంది. మార్వల్ క్వీన్ లా ఉంది.. రాశీ ఒకవేళ హాలీవుడ్ కి జంప్ అవుతుందేమో! అంటూ అభిమానులు జోష్ ఫుల్ గా కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ది సబర్మతి రిపోర్ట్ వెబ్ సిరీస్ కి విమర్శల ప్రశంసలు దక్కాయి. ఇందులో రాశీఖన్నా నటనకు మంచి పేరొచ్చింది. తదుపరి సినిమాల గురించి ప్రకటిస్తుందేమో వేచి చూడాలి.
మద్రాస్ కేఫ్ నుండి...
మద్రాస్ కేఫ్ నుండి ది సబర్మతి రిపోర్ట్ వరకు రాశీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. ఇది చాలా సుసంపన్నమైన ప్రయాణం.. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించినందుకు గౌరవంగా..''ఎక్స్‌ట్రార్డినేర్ సెన్సేషనల్ పెర్ఫార్మర్'' అవార్డుకు ఎంపికైంది. నెక్సా బ్రాండ్స్ ఐఎన్‌సి ఈ పురస్కారం అందించింది.