ఫోటో స్టోరి: రాశీ కిల్లర్ భంగిమలు
నేటి తరంలో తీవ్రమైన పోటీ ప్రపంచంలో తెలివిగా కెరీర్ బండిని నడిపిస్తున్న భామ రాశీ ఖన్నా.
By: Tupaki Desk | 20 Nov 2024 11:30 PM GMTనేటి తరంలో తీవ్రమైన పోటీ ప్రపంచంలో తెలివిగా కెరీర్ బండిని నడిపిస్తున్న భామ రాశీ ఖన్నా. దశాబ్ధ కాలంగా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కెరీర్ జర్నీ సాగించింది. తమిళం, హిందీ భాషల్లోను వీలున్నప్పుడల్లా నటిస్తూనే ఉంది. మూడు భాషల్లో అవకాశాలను అంది పుచ్చుకుంటోంది.
ఒక్క అడుగుతో మొదలైన కెరీర్ అంచెలంచెలుగా ఎదిగింది. రాశీ విభిన్నమైన పాత్రల్లో నటించి తనదైన అందం, నట ప్రదర్శనతో మైమరిపించింది. ఇదే విషయాన్ని రాశీ తెలివైన పంథాలో అభిమానుల కోసం వెల్లడించింది. ``మద్రాస్ కేఫ్ నుండి `ది సబర్మతి రిపోర్ట్` వరకు, ఇది చాలా సుసంపన్నమైన ప్రయాణం. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించినందుకు గౌరవం పొందాను.. వినయంగా ఉంటాను. ``ఎక్స్‌ట్రార్డినరీ సెన్సేషనల్ పెర్ఫార్మర్`` అవార్డుకు @nexbrands.incకి ధన్యవాదాలు`` అని రాసింది.
రాశీ ఖన్నా తన అవార్డును ప్రదర్శిస్తూ ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ కోసం వంగ పువ్వు (బ్రింజాల్) రంగు ఫ్రాక్ ధరించి వయ్యారంగా హొయలు పోయింది. పరిమిత మేకప్ తో కనిపించిన రాశీ హాఫ్ షోల్డర్ దుస్తుల్లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. అది థై స్లిట్ ఫ్రాక్. హై హీల్స్ ధరించి ఫోజులిచ్చింది. ముఖ్యంగా ఆ మెడలో అందమైన లాకెట్ తన గ్లామ్ ని పదింతలు పెంచిందని చెప్పాలి.
రాశీ ఇటీవల మూడు భాషల్లో నటించింది. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ `ఫర్జీ`లోను కీలక పాత్రను పోషించింది. మునుముందు మరిన్ని వెబ్ సిరీస్ లకు సంతకాలు చేయనుందని తెలుస్తోంది. తెలుసు కదా.. అగాథియా లాంటి చిత్రాల్లోను నటిస్తోంది.