Begin typing your search above and press return to search.

చీరకట్టులో అందాల రాశి.. స్టన్నింగ్ లుక్స్

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌ పరిశ్రమల్లోనూ రాశి తన అందం, ప్రతిభతో ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   14 Jan 2025 12:30 PM GMT
చీరకట్టులో అందాల రాశి.. స్టన్నింగ్ లుక్స్
X

రాశి ఖన్నా.. టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. 2014లో విడుదలైన ఊహలు గుసగుసలాడే సినిమాతో మొదలైన అమ్మడి ప్రయాణం ఆ తరువాత హడావుడిగానే కొనసాగింది. హీరోయిన్ గా మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, రాశి ఖన్నా తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు. సుప్రీం, జిల్, తొలిప్రేమ వంటి చిత్రాల్లో నటించి, నటనలో తనకంటూ ఓ ముద్ర వేశారు.


టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌ పరిశ్రమల్లోనూ రాశి తన అందం, ప్రతిభతో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. మద్రాస్ కేఫ్ వంటి హిందీ చిత్రాలతో పాటు, తమిళ సినిమాల్లోనూ మంచి అవకాశాలను దక్కించుకుంది. ఆమె కెరీర్‌లో బెస్ట్ సినిమాలలో ఇమైక్క నొడిగల్ తమిళ సినిమా. ఈ చిత్రంలో ఆమె నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి.


రాశి ఖన్నా తన సినీ ప్రయాణంలో గ్లామర్ పాత్రలతో పాటు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న పాత్రలను కూడా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రాశి ఖన్నా పొంగల్ సందర్భంగా విషెస్ అందిస్తూ ఎర్రని చీరలో మెరిసిపోతూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణలో స్టైలిష్‌గా కనిపిస్తూ, రాశి తన అందంతో అభిమానులను ఎట్రాక్ట్ చేసింది. ఈ చీరకు తగ్గట్టు మెరిసే బ్లౌజ్ ధరించి, సింపుల్ జువెలరీతో స్టన్నింగ్ లుక్‌లో ఆమె కనిపించారు.


సూర్య కాంతి పడ్డ లైటింగ్‌లో, ఆమె ముఖ కాంతి మరింత అందంగా మెరవడం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇక రాశి ఖన్నా ఫోటోలకు సంబంధించిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అందంగా కనిపించే ఈ ఫోటోలపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "కణ్మణి" అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలకు కలెక్షన్ లక్షల్లో లైకులు వచ్చాయి.


ఈ చీరలో ఆమె చూపించిన ఆహార్యం, ఆమె వ్యక్తిత్వాన్ని మరింత హైలైట్ చేస్తూ, ట్రెడిషనల్ లుక్‌లో కూడా ఆమె ఎంత అందంగా ఉంటారో చూపించారు. ప్రస్తుతం రాశి ఖన్నా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక హిందీ సినిమాతో పాటు, తమిళంలో కూడా ఓ ప్రముఖ హీరోతో సినిమా చేస్తుంది. అంతేకాకుండా, తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే సినిమా లైన్ లో ఉంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ కోసం రూపొందుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో కూడా రాశి కీలక పాత్ర పోషిస్తున్నారు. .