హాఫ్ షోల్డర్ గౌనులో రాశీ కిరాక్
రాశీ అందమైన ఆఫ్ షోల్డర్ డిజైనర్ ఫ్రాక్ ని ధరించింది. ఇది థై స్లిట్ ఎలివేషన్‌కి సహకరించే ఫ్రాక్. రాశీ ఈ బ్లాక్ డ్రెస్ లో ఎంతో స్టన్నింగ్ గా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 23 Feb 2025 4:30 PM GMTఇటీవల తెలుగు ఫిలింసర్కిల్స్ లో రాశీఖన్నా సందడి కొంత తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈ భామ ముంబై పరిశ్రమలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి `తెలుసు కదా` చిత్రంలో నటించనుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రాశీ తన అభిమానులను నిరంతరం సోషల్ మీడియాల ద్వారా పలకరిస్తూనే ఉన్నారు. రాశీ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఇన్‌స్టాలో యంగేజ్ చేస్తున్నారు. తాజాగా ఈ దిల్లీ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
రాశీ అందమైన ఆఫ్ షోల్డర్ డిజైనర్ ఫ్రాక్ ని ధరించింది. ఇది థై స్లిట్ ఎలివేషన్‌కి సహకరించే ఫ్రాక్. రాశీ ఈ బ్లాక్ డ్రెస్ లో ఎంతో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. సింపుల్ గా మేకప్ లెస్ లుక్ లో కనిపించిన రాశీ చిరునవ్వుతో ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది. రాశీ బ్లాక్ గౌన్ తన అందాన్ని పదింతలు పెంచిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ యువతరంలో వైరల్ గా మారుతోంది.
ఇటీవలే స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా? పోస్టర్లు విడుదలయ్యాయి. సిద్ధూతో రాశీ కెమిస్ట్రీ ఓ రేంజులో వర్కవుటైందని ప్రశంసలు కురుస్తున్నాయి. పోస్టర్ లో లవ్ ఇంటిమేట్ లుక్స్ యూత్ ని టీజ్ చేసాయి. రాశీ కొంత గ్యాప్ తర్వాత మరో యువహీరోతో ఘనంగా తన కంబ్యాక్ ని చాటుకునే పనిలో ఉంది. వ్వాట్ విల్ హ్యాపెన్స్ వెయిట్ అండ్ సీ.