రాశి ఖన్నా ఒంపుసొంపుల ఖిల్లా!
ప్రస్తుతం వరుసగా క్రేజీ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు రాశీ సన్నాహకాల్లో ఉందని సమాచారం.
By: Tupaki Desk | 16 Dec 2024 11:31 AM GMTరాశి ఖన్నా తన కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తోంది. ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకోలేకపోయినా కానీ నిరాశ చెందక తనవైపు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవలే `సబర్మతి రిపోర్ట్` లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో రాశీ నటించింది. అంతకుముందు రాజ్ అండ్ డీకే రూపొందించిన బ్లాక్ బస్టర్ సిరీస్ `ఫర్జీ`లో, సిద్ధార్థ్ మల్హోత్రా `యోధ`లోను తన నటనకు ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం వరుసగా క్రేజీ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు రాశీ సన్నాహకాల్లో ఉందని సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ ` తెలుసు కదా` అనే తెలుగు చిత్రంలో నటిస్తున్న రాశీ... టిఎంఇ (విక్రాంత్ మాస్సే) అనే హిందీ చిత్రంలోను నటిస్తోంది. `అగథియా` ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. టిఎంఇ, అగథియా కూడా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలేనని తెలుస్తోంది. తమిళ చిత్రం అగథియాలో జీవా, అర్జున్ లాంటి స్టార్లతో కలిసి నటిస్తోంది.
మరోవైపు రాశీ తనలోని గ్లామర్ ఎలివేషన్ తో టీజ్ చేయడంలో తగ్గేదే లే అంటోంది. ఇటీవల కొన్ని బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోషూట్ వైరల్‌గా మారుతోంది. బ్లాక్ డ్రెస్ లో రాశీ ఒంపుసొంపుల వడ్డనలు యూత్ కి గిలిగింతలు పెడుతున్నాయి. రాశీ ఒంపు సొంపుల ఖిల్లా అదుర్స్ అంటూ యువతరంలో ఒకటే చర్చ సాగుతోంది. రాశీ అల్ట్రా స్టైలిష్ అవతార్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది.