Begin typing your search above and press return to search.

పదేళ్లైనా ఇప్పటికీ అదే లవ్.. బుట్టలో పడేసేలా హీరోయిన్ కామెంట్స్..!

మధ్యలో తమిళ సినిమా అవకాశాలను కూడా అందుకున్న అమ్మడు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఛాన్సులను రాబట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 6:54 AM GMT
పదేళ్లైనా ఇప్పటికీ అదే లవ్.. బుట్టలో పడేసేలా హీరోయిన్ కామెంట్స్..!
X

మద్రాస్ కేఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా మొదటి సినిమా బాలీవుడ్ లో చేసినా ఆ వెంటనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ కలిసి చేసిన మనం సినిమాలో చిన్న రోల్ చేసిన అమ్మడు ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నాగ శౌర్య హీరోగా చేసిన ఊగలు గుసగుసలాడే సినిమాలో నటించింది. అప్పటి నుంచి తెలుగులో కెరీర్ కొనసాగించిన రాశి ఖన్నా స్టార్ క్రేజ్ తెచ్చుకోలేదు కానీ యువ హీరోలతో జత కడుతూ పాపులారిటీ అయితే తెచ్చుకుంది.

మధ్యలో తమిళ సినిమా అవకాశాలను కూడా అందుకున్న అమ్మడు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఛాన్సులను రాబట్టుకుంటుంది. రీసెంట్ గానే ఊహలు గుసగుసలాడే సినిమా రిలీజై పదేళ్లు పూర్తి చేసుకోగా ఆ సినిమా గురించి పదేళ్ల తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమా సక్సెస్ తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని. ఆ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేశారని చెప్పింది రాశి ఖన్నా.

అంతేకాదు కెరీర్ ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు అపారమైన ప్రేమ అభిమానం దక్కుతుందని చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. మొదటి సినిమా టైం లో ఇక్కడ భాష సంస్కృతి తెలియకపోయినా ఇక్కడ ఆడియన్స్ తనని ఆదరించారని.. తొలి సినిమాకు వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోను అంటుంది అమ్మడు.

అందం అభినయం రెండు ఉన్నా సరైన టైం లో అమ్మడు చేసుకున్న కథల ఎంపిక వల్ల రాశి ఖన్నా సగటు హీరోయిన్ గానే మిగిలిపోయింది. అవసరమైనప్పుడల్లా గ్లామర్ షోతో రెచ్చిపోయినా ఎందుకో అమ్మడు కెరీర్ లో అనుకున్నంత డిమాండ్ సంపాదించలేకపోయింది. అయితే ఇప్పటికీ తెలుగు తమిళ భాషల్లో అరకొర ఛాన్సులు అందుకుంటుంది రాశి. ప్రస్తుతం అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అమ్మడితో పాటుగా కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తెలుగులో దాదాపు యువ హీరోలందరితో నటించిన రాశి ఖన్నా స్టార్ సినిమా ఛాన్స్ లు రాబట్టడంలో వెనకబడింది. ఈమధ్య సోషల్ మీడియాలో గ్లామర్ షోతో మరింత రెచ్చిపోతున్న అమ్మడు తాను ఇంకా ఫాం లోనే ఉన్నా అని చెప్పకనే చెబుతుంది. మరి రాశి ఇన్నింగ్స్ కి బూస్టింగ్ ఇచ్చే సినిమా ఒక్కటి పడితే మాత్రం కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.