Begin typing your search above and press return to search.

రాశీఖ‌న్నా డ్రీం ద‌ర్శ‌కుడు ఆయ‌నే!

దశాబ్ద కాలం క్రితం ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను హీరోయిన్‌ గా మెప్పించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

By:  Tupaki Desk   |   30 March 2024 4:28 AM GMT
రాశీఖ‌న్నా డ్రీం ద‌ర్శ‌కుడు ఆయ‌నే!
X

దశాబ్ద కాలం క్రితం ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను హీరోయిన్‌ గా మెప్పించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రాశి ఖన్నా కు నటిగా మంచి మార్కులు పడ్డాయి. సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా రాణించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి.


ఆ విషయాన్ని పట్టిన రాశి ఖన్నా కష్టపడి చాలా బరువు తగ్గి బొద్దుగుమ్మ కాస్త ముద్దుగుమ్మ అన్నట్లు తయారు అయ్యింది. ఆమె కోరుకున్నట్లుగానే సన్నగా అయ్యాక యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా రాశి ఖన్నా ఎక్కువ దృష్టి పెట్టింది. హిందీలో వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతోంది.

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఇండస్ట్రీలో ఒక డ్రీమ్ ఉందని, అదే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వర్క్ చేయాలి. ఆయనతో నేనే కాదు దాదాపు అందరు హీరోయిన్స్ కూడా ఆయన దర్శకత్వంలో ఒక్కసారి అయినా నటించాలని కోరుకుంటారు.

ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవారిని గొప్పగా చూపించే దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ముందు ఉంటారు. ఆయన సినిమాలను విమర్శకులు సైతం మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో నటించడం అనేది నా కల అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

ఇక రాశి ఖన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే... ది సబర్మతీ రిపోర్ట్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. మరో వైపు ఫర్జీ అనే వెబ్‌ సిరీస్ తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫర్జీ పై రాశి ఖన్నా చాలా నమ్మకం గా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తెలుగు లో మాత్రం రాశి ఖన్నా సినిమాలు ఏవీ లేవు.