లెహంగా అందం అంతా రాశీఖన్నా మయం!
అందాల రాశీఖన్నా కాన్సంట్రేషన్ అంతా కోలీవుడ్..బాలీవుడ్ చిత్రాలపై పెట్టిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 13 July 2024 12:48 PM GMTఅందాల రాశీఖన్నా కాన్సంట్రేషన్ అంతా కోలీవుడ్..బాలీవుడ్ చిత్రాలపై పెట్టిన సంగతి తెలిసిందే. అమ్మడి నుంచి గత ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలో ఖాళీగా ఉండి ఏం చేస్తుంది అనుకున్నారంతా. కానీ ఇలా షాకిచ్చిలా అవకాశాలు అందుకుని బిజీ అవుతుందని ఎవరూ అనుకుని ఉండరు. అవును రాశీకన్నా ఇప్పుడు రెండు భాషల్లోనూ కలిపి ఐదారు సినిమాలు చేస్తోంది.
అందులో `తెలుసు కదా` అనే తెలుగు సినిమా ఒక్కటి ఉంది. మిగతా చిత్రాలన్ని పరభాషకు చెందినవే. `టీ ఎమ్ ఈ`...`ది సబర్మతి రిపోర్ట్` చిత్రాల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం అవి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. సబర్మతి రిపోర్ట్ పై భారీ అంచనాలున్నాయి. గోద్రా రైలు దుర్ఘఘనకు సంబంధించిన అంశం కావడంతో దేశ వ్యాప్తంగా ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈనెలలోనే రిలీజ్ అవ్వాలి కానీ అభ్యం తరాలు ఉండటంతో వాయిదా వేసారు. ఈ సినిమాపై రాశీఖన్నా చాలా ఆశలు పెట్టుకుంది. ఇలా నటిగా ఇంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోలు మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో విరుచుకుపడుతోంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా అందమైన లెహంగా దుస్తుల్లో మరింత అందంగా ముస్తాబై ఇలా దర్శన మించింది.
వైట్ లెహంగా రాశీ అందాన్ని మరింత రెట్టింపు చేసింది. మెడలో డిజైనర్ హారం, చెవులకు పెట్టుకున్న రింగులు ప్రతీది రాశీని మరింత అందంగా తీర్చి దిద్దాయి. కళ్లకు ఐటెక్స్... నుదిటిన చిన్న బొట్టు సైతం పెట్టుకుని కొత్తగా ప్రజెట్ అయింది. లెహంగాలో రాశీ అలా కింద కూర్చుకుని కెమెరాకి ఫోజులిచ్చింది. లెహంగాని నేలపై అందంగా పరిచిన వైనం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాశీని లెహంగాలో చూసి అభిమానులు వెర్రెత్తిపోతున్నారు.