Begin typing your search above and press return to search.

బాబోయ్‌ రాశి ఖన్నాతో నా వల్ల కాదు : అవసరాల

అష్టాచమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   27 April 2024 2:30 PM GMT
బాబోయ్‌ రాశి ఖన్నాతో నా వల్ల కాదు : అవసరాల
X

అష్టాచమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. అంతే కాకుండా దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్‌ లను సొంతం చేసుకున్నాడు.

నటుడిగా, దర్శకుడిగా సక్సెస్‌ అయిన అవసరాల శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హీరోయిన్‌ రాశి ఖన్నాతో తన స్నేహం గురించి మాట్లాడాడు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రాశి ఖన్నా కు అప్పటి నుంచి అవసరాల శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. రాశి ఖన్నా తో తనది సుదీర్ఘ కాలపై స్నేహం అంటూ అవసరాల పేర్కొన్నాడు. రాశి ఖన్నా కారు డ్రైవ్‌ చేస్తున్న సమయంలో నేను ఆమె పక్కన కూర్చోలేను.

ఒక సారి ఆమె డ్రైవ్ చేస్తున్న సమయంలో కూర్చున్నాను. స్టంట్స్ మాస్టర్స్ కన్నా దారుణంగా, ర్యాష్ గా కారును రాశి ఖన్నా డ్రైవ్‌ చేస్తుంది. అందుకే రాశి ఖన్నాతో కారు జర్నీ నా వల్ల కాదు. ఆ తర్వాత ఎప్పుడు ఆమె కారు డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో నేను కూర్చోలేదు అన్నాడు.

తాను అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన సమయంలో రాకెట్‌ బాల్‌ గేమ్‌ నేర్చుకున్నాను. దాదాపు అయిదు గంటల పాటు రాకెట్‌ బాల్‌ గేమ్‌ ఆడేవాడిని. డైలీ కాలేజ్ అయ్యాక సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు రాకెట్‌ బాల్‌ గేమ్‌ ఆడటం వల్ల కాలేజీ లో క్లబ్ తరపున, ఆ తర్వాత అక్కడి స్టేట్‌ లెవల్‌ లో కూడా నాకు అవకాశం వచ్చింది.

అమెరికాలో నేను రాకెట్‌ బాల్ గేమ్‌ ఆడి ఎన్నో మెడల్స్ ను దక్కించుకున్నాను అనే షాకింగ్‌ విషయాన్ని అవసరాల ఇన్నాళ్ల తర్వాత చెప్పుకొచ్చాడు. అప్పట్లో సన్నగా ఉన్నా కూడా రాకెట్‌ బాల్‌ గేమ్‌ లో చాలా ప్రతిభ కనబర్చేవాడిని అని అవసరాల అన్నాడు.