ట్రెడిషనల్‌గానే హీటేక్కిస్తున్న రాశిఖన్నా
తాజాగా కళ్ళు చెదిరే రేంజ్లో పోజులు ఇచ్చింది. పర్పుల్ కలర్ లెహంగాలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ఎద అందాలను చూపించింది.
By: Tupaki Desk | 28 Oct 2023 12:38 PM GMTటాలీవుడ్ బ్యూటీ ఏంజిల్ రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి చిత్రంతోనే యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండే ఈ భామ ఆ తర్వాత నాజూకుగా మారి ట్రెండ్‌కు తగ్గట్టుగా కలర్‌ఫుల్ ఔట్ఫిట్లలో బికినీలలో మెరుపులు మెరిపించడం ప్రారంభించింది. తాజాగా మరోసారి ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ఎద అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.
తెలుగులో జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్‌లో నటించిన ఈ భామ.. ఎందుకో స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. కానీ వరుసగా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు హోమ్లీగా కనిపిస్తూనే, గ్లామర్ పాత్రల్లో మెప్పించగల నటి ఈ ముద్దుగుమ్మ. అలరిపిల్లగా, ఎమోషనల్‌గా కూడా అలరించగలదు.
ఆ మధ్య పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అవి కూడా నిరాశపరిచాయి. హిందీలోనూ ఫర్జీ సహా పలు వెబ్‌సిరీస్‌లు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన అందంతో యువతకు గిలిగింతలు కూడా పెడుతుంటుంది.
తాజాగా కళ్ళు చెదిరే రేంజ్లో పోజులు ఇచ్చింది. పర్పుల్ కలర్ లెహంగాలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ఎద అందాలను చూపించింది. తన గ్లామర్‌తో మెరుపులు మెరిపించింది. ఈ డ్రెస్‌లో రాశీ.. బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తూ.. ఫుల్ బాటిల్ కిక్ ఇస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో సెగలు పుట్టిస్తోందని చెబుతున్నారు. రాశి ఖన్నా క్లీవేజ్ షో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని అంటున్నారు.
ఇకపోతే రాశీఖన్నా ప్రస్తుతం.. తమిళం, హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో యోధా, విక్రాంత్ మాస్సే.. తమిళంలో మేధావి, అరణ్మనై సినిమాలు చేస్తోంది. తెలుగులో రీసెంట్గా సిద్ధు జొన్నల్లగడ్డతో తెలుసు కదా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుసు కదా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. మరి ఈ చిత్రాలు ఆమెకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తాయో..