Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా ఇక మీదట స్పెషల్‌...!

నటిగానే కాకుండా అందంగా కూడా అలరించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   18 Jun 2024 11:30 PM GMT
రాశి ఖన్నా ఇక మీదట స్పెషల్‌...!
X

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ సినిమాలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగానే కాకుండా అందంగా కూడా అలరించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించిన విషయం తెల్సిందే.

ఇటీవల హిందీలో కూడా ఈ అమ్మడు ఒక సినిమాను చేసి మెప్పించింది. తెలుగు కంటే కూడా ఎక్కువగా తమిళంలో ఈ మధ్య కాలంలో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇటీవలే అరణ్మణై 4 లో తమన్నా తో కలిసి నటించిన విషయం తెల్సిందే.

ఒకప్పుడు గ్లామర్ షో కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో చీర కట్టు పోటోలతో అలరిస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను కాకుండా పద్దతైన పాత్రలో కనిపిస్తూ, ఫోటో షూట్స్ ను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ఇక ముందు తాను చేయబోతున్న సినిమాలు మరియు సిరీస్‌ లు వాటిల్లో తాను కనిపించే విధానం చాలా స్పెషల్‌ గా ఉండబోతున్నట్లుగా పేర్కొంది. ఇటీవల రాశి ఖన్నా షేర్‌ చేస్తున్న పాత్రలతో మరింత గుర్తింపును సొంతం చేసుకుంది.

గ్లామర్‌ పాత్రలు చేయడం ద్వారా రాశి ఖన్నా ఇన్నాళ్లు వార్తల్లో నిలిచింది. అయితే ఇకపై ప్రత్యేకమైన పాత్రలు చేయడం ద్వారా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ద్వారా అభిమానులను సొంతం చేసుకోవాలని రాశి ఖన్నా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.