Begin typing your search above and press return to search.

ఓటీటీలో క్రేజీ 'కామెడీ' వెబ్ సిరీస్.. మీరు చూశారా?

కొన్ని స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారు కూడా. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారం వారం కొత్త కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 2:45 AM GMT
ఓటీటీలో క్రేజీ కామెడీ వెబ్ సిరీస్.. మీరు చూశారా?
X

ప్రస్తుత రోజుల్లో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో విడుదలైన సినిమాలు.. కొద్ది రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తుండడంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అదే సమయంలో క్రేజీ వెబ్ సిరీసులను నిర్వాహకులు తీసుకొస్తున్నారు. కొన్ని స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారు కూడా. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారం వారం కొత్త కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఎప్పటిలానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్.. ఈ వీక్ కూడా కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. అందులో హిందీ వెబ్ సిరీస్ రాత్ జవాన్ హై.. ఓటీటీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటోంది. అనేక మంది రాత్ జవాన్ హై వెబ్ సిరీస్ చూసి సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. అలా నెట్టింట ఎక్కడ చూసినా రాత్ జవాన్ హై సిరీస్ కు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి.

రాధిక (అంజలి ఆనంద్), అవినాశ్ (బరున్ సోబ్తి), సుమన్ (ప్రియా బాపత్) అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ వెబ్ సిిరీస్ అంతా తిరుగుతోంది. యంగ్ ఏజ్ అయ్యాక.. ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టిన వారి కష్టాలను సిరీస్ హైలెట్ చేస్తోంది. ఫ్రెండ్ షిప్ ను సరైన రీతిలో చూపిస్తోంది. ముగ్గురు ఒకరినొకరు హెల్ప్ చేసుకుని.. లైఫ్ ను లీడ్ చేసేందుకు ప్రయత్నించే విధానం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అంజలి ఆనంద్.. మల్టీ టాస్కింగ్ మదర్ గా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

చమత్కారమైన డైలాగ్స్, కామెడీ టైమింగ్.. అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. నటీనటులంతా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి. చివరి రెండు ఎపిసోడ్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. క్లైమాక్స్ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రాత్ జవాన్ హై వెబ్ సిరీస్.. మస్ట్ వ్యాచబుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్లైమాక్స్ తో పాటు అక్కడక్కడ సీన్స్ తప్ప.. ఓవరాల్ గా చాలా బాగుందని చెబుతున్నారు.