ధనుష్ మైల్ స్టోన్ మూవీ.. అసలు సౌండ్ లేదే..?
ధనుష్ దర్శకత్వంలో వస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
By: Tupaki Desk | 24 July 2024 9:52 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన రాయన్ మూవీ జులై 26న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోలీవుడ్ లో రాయన్ మూవీపైన భారీ హైప్ నెలకొని ఉంది. ఇలాంటి మాస్ కథలకి కోలీవుడ్ ఆడియన్స్ పెద్దపీట వేస్తారు.
ధనుష్ దర్శకత్వంలో వస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం. ధనుష్ చివరిగా తెలుగులో సార్ మూవీతో సక్సెస్ అందుకున్నారు. తరువాత కెప్టెన్ మిల్లర్ మూవీ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ ని సాధించలేదు. ఇప్పుడు రాయన్ మూవీతో తెలుగులో సక్సెస్ అందుకొని తన మార్కెట్ పెంచుకోవాలని ధనుష్ అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమాకి తెలుగులో పెద్ద బజ్ క్రియేట్ చేయడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా తక్కువగా జరిగాయంట..
మూవీ ట్రైలర్ లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు. రాయన్ మూవీలో యూనివర్సల్ అప్పీల్ ఉన్నట్లు కనిపించలేదు. తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. తరువాత పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. దీంతో రాయన్ మూవీ రిలీజ్ అవుతుందనే విషయం కూడా తెలుగు రాష్ట్రాలలో చాలా మందికి తెలియదు.
మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ కావడంతో కచ్చితంగా మౌత్ టాక్ తో జనాలకి రీచ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే ప్రకాష్ రాజ్, ఎస్.జె.సూర్య వరలక్ష్మి శరత్, అపర్ణ బాలమురళీ లాంటి స్టార్ క్యాస్టింగ్ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్ ఉన్న కూడా తెలుగులో రాయన్ పై పెద్దగా హైప్ లేదని చెప్పొచ్చు.
ధనుష్ కథలని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆయన చేసే సినిమాలలో బలమైన సంఘర్షణ ఉంటుంది. ఆ ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే మాత్రం మౌత్ టాక్ తో థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోతాయి. కెప్టెన్ మిల్లర్ లాంటి డిజాస్టర్ తర్వాత స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ఈ రాయన్ మూవీ ధనుష్ 50వ చిత్రం కావడం విశేషం. మరి ఈ మైల్ స్టోన్ మూవీతో ఏ మేరకు ధనుష్ సక్సెస్ అందుకుంటాడు అనేది వేచి చూడాలి.