Begin typing your search above and press return to search.

హనీ రోజ్ 'రాహేలు'.. టీజర్ ఎలా ఉందంటే?

తాజాగా సినిమా టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. 'చీకట్లో నేను చూసిన ఆ ఎరుపెక్కిన కళ్లు కలైతే కాదు.. అది కలే అయినా వాటిని మర్చిపోను వెతకాలి చంపాలి' అంటూ హనీ రోజ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 2:47 PM GMT
హనీ రోజ్ రాహేలు.. టీజర్ ఎలా ఉందంటే?
X

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ లోకి మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్యకు సరైన జోడీ అనిపించుకుంది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది. కిర్రాక్ గ్లామర్ తో కుర్రాళ్ల మనసులు దోచేసింది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. వేరే లెవల్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.

అయితే హనీ రోజ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా నెలలు అవుతుంది. కానీ ఆమెకు క్రేజ్ మాత్రం అలానే ఉంది. చెక్కుచెదరలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. గ్లామర్ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తుంటోంది. సినిమాలతో సందడి చేయకపోయినా.. నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంటోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోపాటు ఏదో ఒక ఈవెంట్ లో కనిపిస్తూనే ఉంటోంది.

ఇక హనీ రోజ్.. చాలా నెలల క్రితం రాహేలు అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. అప్పుడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో హిట్ పుట్టించే లుక్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కత్తి పట్టుకుని బీఫ్‌ కొడుతూ షాకింగ్ లుక్ లో కనిపించింది. ఇప్పుడు చాలా నెలల తర్వాత ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా సినిమా టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. 'చీకట్లో నేను చూసిన ఆ ఎరుపెక్కిన కళ్లు కలైతే కాదు.. అది కలే అయినా వాటిని మర్చిపోను వెతకాలి చంపాలి' అంటూ హనీ రోజ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. గ్లామర్‌ తో పాటు కత్తి పట్టుకుని ఎవరిపైనో ఎదురుదాడికి దిగుతున్నట్లు చూపించారు. చివర్లో ఎవరో చనిపోయినట్లు కూడా కనిపించారు. మొత్తానికి ఈ సినిమా మంచి గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

మూవీపై ఇంట్రెస్ట్ కూడా పెంచుతోంది. ఆనందిని బాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అబ్రిడ్‌ షైన్‌, షినోయ్‌ మాథ్యూ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇషాన్ ఛబ్రా సంగీతం అందిస్తున్నారు. స్వరూప్ ఫిలిప్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. బాబూరాజ్‌, కళాభవన్‌ షాజోన్‌, రోషన్‌ బషీర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.