రాధే శ్యామ్ సినిమా వల్లే ఆ అవకాశమొచ్చింది: పూజా హెగ్డే
నాలుగేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డ గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతుంది.
By: Tupaki Desk | 5 Feb 2025 6:57 AM GMTనాలుగేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డ గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతుంది. బాలీవుడ్ లో సెటిల్ అవుదామనుకుని తెలుగులో వచ్చిన ఆఫర్లను కొన్ని కాదనుకోవడం, తర్వాత తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అమ్మడికి తెలుగులో అవకాశాలు రావడం తగ్గిపోయాయి.
రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దేవాతో ప్రేక్షకుల్ని పలకరించిన పూజా ఆ సినిమాతో మరో ఫ్లాపును మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే అమ్మడు తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది.
సౌత్ లో అవకాశాలు లేని టైమ్ లో వచ్చిన రెట్రో ఛాన్స్ ను గట్టిగా వాడుకోవాలని పూజా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి టైమ్ లో పూజా సూర్య సరసన అవకాశం అందుకోవడమంటే అదృష్టమనే చెప్పాలి. అయితే ఈ అదృష్టం తనకెలా దక్కిందో పూజా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
రెట్రోలో తనకు ఛాన్స్ రావడం గురించి మాట్లాడుతూ ఈ అవకాశం రావడానికి కారణం రాధే శ్యామ్ సినిమా అని చెప్పింది పూజా. రాధే శ్యామ్ సినిమాలో తన ఎమోషనల్ సీన్స్ చూసి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా కోసం తనను ఎంపిక చేశారని తెలిపింది. రెట్రోలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఇందులో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని పూజా ఈ సందర్భంగా వెల్లడించింది.
దీంతో పాటూ విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా గురించి కూడా పూజా మాట్లాడింది. జన నాయకుడు సినిమాలో తాను కూడా భాగమవడం ఎంతో సంతోషంగా ఉందని, విజయ్ ఆఖరి సినిమా అనగానే ఏమీ ఆలోచించకుండా వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నట్టు పూజా వెల్లడించింది. అయితే గతంలో వీరిద్దరూ కలిసి బీస్ట్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బీస్ట్ కూడా ఫ్లాప్ గానే నిలిచింది. ఇప్పుడు కోలీవుడ్ లో చేస్తున్న ఈ రెండు సినిమాలతో అయినా పూజా హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.