అంబానీ కోడలు ఇలాంటి ఫన్ లైఫ్‌లో అనుభవించి ఉండదు
ఈ జంట ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ కార్ లో షికార్ కి వెళ్లినప్పటి ఫోటోలు వీడియోలు ఇంతకుముందు వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 13 Nov 2024 4:58 PM GMTప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు దఫాలుగా నెలల పాటు సాగిన ఈ పెళ్లి కోసం అంబానీ ఏకంగా 2000 కోట్లు ఖర్చు చేసాడు. అనంత్ - రాధిక జంట ఫ్యామిలీ లైఫ్ సెలబ్రేషన్ ఇప్పుడు చర్చగా మారుతోంది. ఈ జంట ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ కార్ లో షికార్ కి వెళ్లినప్పటి ఫోటోలు వీడియోలు ఇంతకుముందు వైరల్ గా మారాయి. ఇంతలోనే ఇప్పుడు దుబాయ్ ట్రిప్ లో భారీ మంది మార్భలంతో కనిపించారు.
భర్త అనంత్ అంబానీతో కలిసి రాధిక మర్చంట్ దుబాయ్‌లో ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. రాధిక టర్కిష్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. ఐస్‌క్రీమ్ విక్రేత ఆమెకు కోన్ అందిస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతడి మ్యాజిక్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.. బాగా నవ్వించింది. రాధిక చేతికి కోన్ అందించినా కానీ దానినుంచి ఐస్ క్రీమ్ మిస్సవుతోంది. ఐస్ క్రీమ్ అందుకుంటే, కోన్ మాయమవుతుంది. నిజంగా అతడి ట్రిక్ అందరినీ ఆకర్షించింది. రాధిక కోన్‌ను పట్టుకున్నప్పుడు, ఐస్‌క్రీమ్ విక్రేత దాని నుండి ఐస్‌క్రీమ్‌ని వేగంగా తీసివేసి, ఆమెకి ఖాళీ కోన్ ని ఇవ్వడం నిజంగా మ్యాజికల్. అతడి వృత్తి నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పక్కనే నిల్చున్న అనంత్ అంబానీ కూడా నవ్వుతూ కనిపించారు. ఒకానొక సమయంలో సహాయం కోసం రాధిక తన భర్త వైపు చూసింది. కానీ అతడు నవ్వి మళ్లీ ప్రయత్నిస్తూ ఉండమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత విక్రేత చివరకు ఐస్‌క్రీమ్ కోన్‌ను రాధికకు అందించాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి కదిలి వెళ్లారు.
రాధికా మర్చంట్ నుంచి రాధికా అంబానీగా..
జూలైలో అనంత్ అంబానీతో రాధిక వివాహం జరిగింది. ఎట్టకేలకు అధికారికంగా తన ఇంటి పేరును స్వీకరించారు. రాధిక మర్చంట్ నుంచి రాధిక అంబానీగా మారారు. అంబానీ కుటుంబంలో ప్రవేశించిన తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో `రాధికా అంబానీ` అని టైటిల్ వేసారు. ఆమె తండ్రి విరెన్ మర్చంట్ కంపెనీ అయిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాధికా అంబానీ, భారతదేశంలో తమ సంస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దక్షిణాది ప్రాంతాల్లో వ్యాపార విస్తరణపైనా దృష్టి సారిస్తున్నామన్నారు.