Begin typing your search above and press return to search.

బేబి బంప్ తో రాధికా ఆప్టే స‌ర్ ప్రైజ్!

బేబి బంప్ ఫోటోల్ని నాన్ సెల‌బ్రిటీలు కూడా పోస్ట్ చేస్తున్నారు కానీ రాధికా ఆప్టే స‌డెన్ గా బేబి బంప్ తో అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 6:07 AM GMT
బేబి బంప్ తో రాధికా ఆప్టే స‌ర్ ప్రైజ్!
X

గ‌ర్బం దాల్చితే హీరోయిన్లు ఇప్పుడు ఎంతో సంతోషంగా షేర్ చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు విష‌యం చెప్పి అభినంద‌న‌లు అందుకుంటున్నారు. పుట్ట‌బోయే బిడ్డ విష‌యంలో వాళ్ల నుంచి కూడా సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటున్నారు. రెండు..మూడు..ఎనిమిది నెల‌ల బేబి బంప్ ఫోటోలు సైతం షేర్ చేస్తున్నారు. కొంత మంది ఈ స‌మ‌యంలో బేబి ప్రొడ‌క్ట్ ఉత్ప‌త్తుల్ని ఇన్ స్టాన్ వంటి మాధ్య‌మాల్లో ప్ర‌మోట్ చేసి కొంత ఆదాయం అందుకుంటున్నారు.

బేబి బంప్ ఫోటోల్ని నాన్ సెల‌బ్రిటీలు కూడా పోస్ట్ చేస్తున్నారు. కానీ రాధికా ఆప్టే స‌డెన్ గా బేబి బంప్ తో అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసింది. కొత్త సినిమా కోసం లండ‌న్ ప్రీమియ‌ర్ షోకి వెళ్ల‌గా అక్క‌డ టైట్ పిట్ దుస్తుల్లో బేబి బంప్ తో ఫోటోల‌కు ఫోజులిచ్చింది. `సిస్ట‌ర్ మిడ్ నైట్` అనే సినిమా కేన్స్ ఫిల్మ్ పెస్టివ‌ల్స్ లోనూ ప్ర‌ద‌ర్శించారు. రెండు విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకుంది. ఈ సినిమా అక్టోబ‌ర్ 20న రిలీజ్ అవుతుంది.

దీనిలో భాగంగానే లండ‌న్ ప్రీమియ‌ర్ షోకి హాజ‌రైంది. అయితే రాధికా ఆప్టేని అలా చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు. ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా చెప్పింది లేదు. ఈ విష‌యంలో మాత్రం ఎంతో గోప్యత వ‌హించింది. ఆన్ స్క్రీన్ పై ఎంతో బోల్డ్ గా న‌టించే రాధిక ఈ విష‌యాన్ని ఎందుకు దాచిన‌ట్లు అంటూ నెట్టింట చ‌ర్చించుకుంటున్నారు.

అయితే ఇది ఆమె వ్య‌క్తిగ‌త విష‌యం. మీడియాకి...జ‌నాల‌కి చెప్పాలా? లేదా? అన్న‌ది ఆమె ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. దాని గురించి చ‌ర్చ కూడా అవ‌న‌సర‌మైన‌దే. కెరీర్ పీక్ లో ఉన్న స‌మ‌యంలోనే బ్రిటీష్ వ‌యోలినిస్ట్ బెండిక్ట్ టేల‌ర్ ని రాధిక వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం జ‌రిగి 12 ఏళ్లు అయింది.