వోగ్ స్పెషల్: బేబి బంప్‌తో రాధిక ఆప్టే
నిజానికి మొన్న అక్టోబర్‌లో రాధికా ఆప్టే ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన బేబీ బంప్‌ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 17 Dec 2024 2:33 PM GMT'రక్త చరిత్ర' ఫేం రాధిక ఆప్టే నట ప్రతిభ గురించి చెప్పాల్సిన పని లేదు. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి తనదైన ముద్ర వేసిన రాధిక బోల్డ్ ప్రదర్శనలతోనే కాకుండా బోల్డ్ గా మాట్లాడటంలోను ప్రసిద్ధి చెందింది. అంతేకాదు నిరంతరం బోల్డ్ ఫోటోషూట్లతో వెబ్ ని షేక్ చేయడం తన హాబీ. ఇటీవలే రాధిక ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రసవం ముందు తన కష్టం గురించి రాధిక 'వోగ్ ఇండియా'తో ఇంటర్వ్యూలో వెల్లడించింది. వారంలో డెలివరీ ఉండగా, బేబి బంప్ ఫోటోషూట్ కోసం తాను ఏం చేసిందో కూడా రాధిక చెప్పింది.
సరిగ్గా డెలివరీకి ఒక వారం ముందు ఫోటోషూట్ కోసం బేబీ బంప్‌తో తాను ఎలా ప్రిపేరైందో రివీల్ చేసింది. అప్పటికే బరువు అసాధారణంగా పెరిగానని, అదుపు తప్పిన బరువుతో పోరాడానని తెలిపింది. ప్రెగ్నెన్సీ సమయంలో తన రూపురేఖలు మారిపోయాయని కూడా రాధిక తన కష్టాన్ని గుర్తు చేసింది.
నిజానికి మొన్న అక్టోబర్‌లో రాధికా ఆప్టే ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన బేబీ బంప్‌ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్‌లో తన బేబీ బంప్‌ను అందంగా ప్రదర్శించింది. డెలివరీకి వారం ముందు వోగ్ సాహసాన్ని కూడా ప్రశంసించి తీరాలి. అయితే బేబి బంప్ ఫోటోలను కాస్త ఆలస్యంగా షేర్ చేసినా కానీ, అవి ఇప్పుడు వెబ్ లో వైరల్ గా మారుతున్నాయి. ప్రసవానికి ముందు రాధిక బాగా బరువు పెరిగింది. కానీ ఈ ఫోటోషూట్ లో ఎంతో నేచురల్ గా కనిపించి ఆకట్టుకుంది.
బరువు పెరగడం ఎంతటి ఇబ్బందికరంగా ఉంటుందో కూడా రాధిక చెప్పింది. ఇంత బరువు పెరగడం నేను ఎప్పుడూ చూడలేదు. నా శరీరం ఉబ్బిపోయింది.. నొప్పులు భరించాను.. నిద్ర లేక కష్టపడ్డాను.. అని తన ఫీలింగ్స్ ని కూడా బయటపెట్టింది. కొత్త తల్లిగా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నానని తెలిపింది. 2025 ఫిబ్రవరి చివరినాటికి లండన్‌లో తన భర్తతో ఉండాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అటుపై పనిని తిరిగి ప్రారంభించడానికి భారతదేశానికి తిరిగి వచ్చేస్తుందట.
అక్టోబర్‌లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు రాధికా ఆప్టే తన బేబీ బంప్‌ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సినిమా `సిస్టర్ మిడ్‌నైట్` షో ప్రీమియర్ కోసం రాధిక హాజరైంది. ప్రఖ్యాత వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం అద్భుతమైన ఫోటోషూట్‌లో పాల్గొనడమే గాక తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన రాధికపై ప్రశంసలు కురిసాయి.
రాధిక బ్రిటీష్ వయోలినిస్ట్, స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను 2012 లో వివాహం చేసుకుంది. ఈ జంట వినోద పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ ఎక్కువగా కలిసి కనిపించరు. బెనెడిక్ట్ ప్రైవసీని ఇష్టపడతారు. 2011లో రాధిక సంగీతం నేర్చుకోవడానికి లండన్‌లో ఉన్నప్పుడు బెనెడిక్ట్ ని కలిశారు. వారు 2012 లో వివాహం చేసుకున్నారు. 2013 లో అధికారికంగా తమ పెళ్లి వేడుకను నిర్వహించారు. రాధిక తన భర్తను కలిసేందుకు లండన్ కి నిరంతర ప్రయాణాల్లో ఉంటారు.