Begin typing your search above and press return to search.

కోడ‌లైన త‌ర్వాత తొలి బ‌ర్త్ డే పార్టీ పీక్స్ లోనే!

అయితే వివాహామైన త‌ర్వాత రాధికా మ‌ర్చంట్ తొలి బ‌ర్త్ డే వేడుక‌ల్ని అంబానీ ఫ్యామిలీ గ్రాండ్ గా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 7:51 AM GMT
కోడ‌లైన త‌ర్వాత తొలి బ‌ర్త్ డే పార్టీ పీక్స్ లోనే!
X

ఇటీవ‌లే రాధికామ‌ర్చంట్ అంబానీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం ప్ర‌పంచ‌మే మాట్లాడుకేనేలా ముకేష్ అంబానీ ఏ రేంజ్ లో చేసారో తెలిసిందే. వివాహానికి ఆరు నెల‌ల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు మొద‌లు పెట్టి పెళ్లి తంతు పూర్త‌య్యే వ‌ర‌కూ సెల‌బ్రేష‌న్లు అంబరా న్నంటాయి. అయితే వివాహామైన త‌ర్వాత రాధికా మ‌ర్చంట్ తొలి బ‌ర్త్ డే వేడుక‌ల్ని అంబానీ ఫ్యామిలీ గ్రాండ్ గా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

ఆమె పుట్టిన రోజు అక్టోబ‌ర్ 16న జ‌రిగింది. కానీ ఆ సెల‌బ్రేష‌న్ల ఫోటోలు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఆ ఫోటోలు లీక్ అయ్యాయి. కొత్త కోడ‌లు పుట్టిన రోజు వేడుక‌ల విష‌యంలోనూ అంబానీ ఏం త‌గ్గ‌లేదు. బాలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌ర్ని పిల‌పించి మ‌రీ సెల‌బ్రేట్ చేసాడు. అంతేనా ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆట‌గాళ్లు సైతం హాజ‌ర‌య్యారు.

ధోనీ, అట్లీ, జాన్వీ క‌పూర్, శిఖ‌ర్ పహారియా, సుహానా ఖాన్. అర్య‌న్ ఖాన్, ర‌ణ‌వీర్ సింగ్, అర్జున్ క‌పూర్ ఇలా దాదాపు బాలీవుడ్ లో సెల‌బ్రిటీలంతా హాజ‌ర‌య్యారు. అటు పారిశ్రామిక వేత్తలు కూడా పెద్ద ఎత్తున హాజరైన‌ట్లు స‌మాచారం. రాజుగారు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వ‌? అన్న‌ట్లు అంబానీ త‌లుచుకుంటే డ‌బ్బుకు కరువా? కోట్లు కోట్లు గుమ్మ‌రిస్తారు. త‌మ రేంజ్ కి త‌గ్గ‌కుండా సెల‌బ్రేష‌న్స్ చేసుకోండ‌ని అదేశాలిస్తారు.

పైగా అంబానీ ఇంట కోడ‌లైన త‌ర్వాత వ‌చ్చిన తొలి బ‌ర్త్ డే కాబ‌ట్టి మామ‌-కొడుకు ఎక్క‌డా త‌గ్గి ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కూ త‌ల్లిదండ్రులిచ్చిన డ‌బ్బుతో మాత్ర‌మే సెల‌బ్రేష‌న్లు చేసుకుని ఉంటుంది. తొలిసారి కోడ‌లిగా అడుగు పెట్టిన వేళ అంబానీ ఎందుకు త‌గ్గుతారు. ధూమ్ ధామ్ గానే జ‌రిగింది ఈవేడుక‌.