జీవిత పోరాటం గురించి రాధిక వ్యాఖ్యలు
జీవితంలో సవాళ్లు ఎదురైనా ధైర్యం కోల్పోవద్దని సూచించారు రాధిక శరత్ కుమార్. సవాళ్లకు సహనంతో ఎదురెళ్లాలని అన్నారు.
By: Tupaki Desk | 9 March 2025 3:31 PM ISTజీవితంలో సవాళ్లు ఎదురైనా ధైర్యం కోల్పోవద్దని సూచించారు రాధిక శరత్ కుమార్. సవాళ్లకు సహనంతో ఎదురెళ్లాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వెటరన్ నటి రాధిక తన జీవితంలోని కొన్ని క్లిష్టమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. మహిళలు బలంగా ఉండాలని, సవాళ్లు ఎన్ని ఎదురైనా ధైర్యం కోల్పోవద్దని సూచించారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు.
ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు మోకాలికి గాయమైందని రాధిక వెల్లడించారు. చాలా మందులు వాడినా రకరకాల చికిత్సలు చేయించుకున్నా కానీ.. ఉపశమనం లభించలేదు. పలుమార్లు థెరపీ సెషన్ల తర్వాత కూడా నొప్పి వేధించింది. చివరికి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది.
ప్రతిదీ బాధిస్తుంది. అయినా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. నొప్పికి వెరవ కూడదని రాధిక అన్నారు. సర్జరీకి ముందు తన సినిమా కమిట్‌మెంట్లన్నీ పూర్తయ్యేలా చూసుకున్నానని రాధిక పేర్కొన్నారు.. షూటింగులలో పాల్గొంటున్నప్పుడు తీవ్రమైన నొప్పిని భరించాల్సి వచ్చేది. కోలుకునే సమయంలో తనను చిన్నపిల్లలా చూసుకున్నందుకు తన భర్త, నటుడు శరత్‌కుమార్ కు కృతజ్ఞతలు తెలిపింది. సవాళ్లతో కూడిన కాలంలో అతని సంరక్షకుడిగా తన భర్త నిలిచాడని ఇది ఎప్పటికీ మరువలేనని రాధిక చెప్పారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన రాధిక బుల్లితెరపైనా నటిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. రాడాన్ మీడియా బుల్లితెర రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. రాధిక శరత్‌కుమార్‌కు తమిళనాడుతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది.