అంబానీ కోడలికి జాన్వీ అండ్ కో పార్టీ అందుకేనా!
రాధికా మర్చంట్ ని ఆహ్వనించి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చింది.
By: Tupaki Desk | 22 July 2024 7:41 AM GMTవివాహానికి ముందు బ్యాచిలర్ పార్టీలు సహజం. పెళ్లిచేసుకునే వారంతా స్నేహితుల్ని ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీ ఇస్తుంటారు. ప్రీవెడ్డింగ్ వేడుకలా ఇదో ప్రీవెడ్డింగ్ బ్యాచిలర్ పార్టీలా మారిపోయిందిప్పుడు. అయితే రాధికా మర్చంట్ విషయంలో మాత్రం ఇది రివర్స్ లో జరిగింది. రాధికా మర్చంట్ ని ఆహ్వనించి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చింది. దీంతో జాన్వీ పార్టీ ఇవ్వడం ఏంటి? అని నెట్టింట చర్చసాగుతుంది.
కానీ ఇంతవరకూ దీని గురించి జాన్వీ ఎక్కడా స్పందిచలేదు. చివరికి నెటి జనులు దాడి తట్టుకోలేక జాన్వీ రిప్లై ఇచ్చింది. రాధిక నాకు మంచి స్నేహితురాలు. తను మాతో ఎంతో సరదాగా ఉంటుంది. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే వివాహానికి ముందు మేమే రాధికకు పార్టీ ఇవ్వాలనుకున్నాం. మా స్నేహితులమంతా కలిసి ఎలాంటి పార్టీ ఇస్తే బాగుంటుందో నిర్ణయించుకుని రాధికని ఆహ్వానించి పార్టీ ఇచ్చాం.
అందుకు రాధిక ఎంతో సంతోషించింది` అని తెలిపింది. ప్రతిగా రాధికా జాన్వీ సహా స్నేహితులందరికీ పెళ్లి కుదిరిన ఐదారు నెలల నుంచి పార్టీలు ఇస్తూనే ఉంది. పెళ్లి మూడు రోజులైతే ప్రత్యేక పార్టీలతో మునిగి తేలిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి పాప్ సింగర్లను రంగంలోకి దించి వాళ్ల ఆధ్వర్యంలో గ్రాండ్ గా పార్టీని సెలబ్రేట్ చేసింది.
ఇక అనంత్ అంబానీ వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత జాన్వీ అండ్ గ్యాంగ్ కి అతడి పార్టీలు ఉంటాయని తెలుస్తోంది. పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.