Begin typing your search above and press return to search.

సూర్య సర్‌ ఏమంటాడో అనే టెన్షన్‌..!

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్ఫీరా చిత్రం నిరాశ పరిచింది. వసూళ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   25 July 2024 11:30 PM GMT
సూర్య సర్‌ ఏమంటాడో అనే టెన్షన్‌..!
X

తమిళం మరియు తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూరారై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) సినిమాను హిందీలో 'సర్ఫీరా' టైటిల్‌ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్ కుమార్‌ హీరోగా రాధికా మదన్‌ హీరోయిన్‌ గా ఈ రీమేక్‌ రూపొందింది.


ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్ఫీరా చిత్రం నిరాశ పరిచింది. వసూళ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. లాంగ్‌ రన్‌ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా హీరోయిన్‌ రాధిక మదన్‌ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ... సర్ఫీరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ కు మా నిర్మాత సూర్య సర్‌ హాజరు అయ్యారు. ఆయన మంచి వ్యక్తి, చాలా తక్కువగా మాట్లాడుతారు. సినిమా స్క్రీన్ పై ప్లే అవుతున్న సమయంలో ఆయన వైపు చూడ్డానికి నాకు భయం వేసింది.

ఆయనకు నా నటన నచ్చుతుందో లేదో, ఆయన నా యాక్టింగ్‌ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేస్తాడా అంటూ చాలా టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ తో ఆయన వైపు కూడా చూడలేదు. కాని సినిమా పూర్తి అయిన తర్వాత బాగా యాక్ట్‌ చేశావు, సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు.

సూర్య గారు నాతో చెప్పిన విషయాలను దర్శకురాలు సుధా కొంగర గారితో చెప్పాను. ఆయన ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్తారు. నీ నటన ఆయనకు నచ్చడం వల్లే బాగుంది అన్నారు. ఆయన అన్నారు అంటే సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని సుధా కొంగర నాతో చెప్పారు.

కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందిన సూరారై పోట్రు హిందీ వర్షన్ లో ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు. హీరో అక్షయ్‌ కుమార్‌ స్టార్‌ ఇమేజ్ కి సౌత్ లో కంటే బాలీవుడ్‌ లో మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల సర్ఫీరా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.