Begin typing your search above and press return to search.

ఆ ల‌వ్ లెట‌ర్ సీక్రెట్ చెప్పేసిన రాధికా మ‌ర్చంట్!

మోనోక్రోమ్ గౌను పై అనంత్ రాసిన ప్రేమలేఖ తో ఆ డ్రెస్ డిజైన్ ముద్రించబడింది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 2:30 PM GMT
ఆ ల‌వ్ లెట‌ర్ సీక్రెట్ చెప్పేసిన రాధికా మ‌ర్చంట్!
X

అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ ల ప్రేమ వివాహం జులైలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అంబ‌రాన్ని అంటేలా రెండు ప్రీ వెడ్డింగ్ లు జ‌రిగాయి. రెండు వేడుక‌లు ఎంతో హైలైట్ అయ్యాయి. ఇక మూడు రోజుల పెళ్లి ఏ రేంజ్ లో జ‌రుగుతుందో ఊహ‌కే అంద‌లేదు. ముఖ్యంగా ఈవెంట్ లో రాధిక హైలైట్ అవుతుంది. డిజైన‌ర్ దుస్తుల్లో రాధిక చూపరుల‌ను ఎంతో ఆక‌ర్షించింది. వాట‌న్నింటిలో డిజైన్ మాత్రం ప్ర‌త్యేకంగా హైలైట్ అయింది.

మోనోక్రోమ్ గౌను పై అనంత్ రాసిన ప్రేమలేఖ తో ఆ డ్రెస్ డిజైన్ ముద్రించబడింది. తాజాగా ఆ ల‌వ్ లెట‌ర్ ప్ర‌త్యేక‌త గురించి రాధిక రివీల్ చేసింది. `నా పుట్టిన రోజు సంద‌ర్భంగా అనంత్ ప్ర‌త్యేకంగా నాకోసం రాసిన ప్రేమ‌లేఖ అది. అందులో నేనంటే ఎంత ఇష్ట‌మో ఉంటుంది. ఆ లేఖ నాకెప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. ఆ ప్రేమ‌లేఖ నాకు మాత్ర‌మే శాశ్వ‌తం కాదు. నేను దానిని నా పిల్లలు- మనవరాళ్లకు కూడా చూపించాల నుకుంటున్నాను.

మా ప్రేమ గురించి వాళ్లు కూడా మాట్లాడుకోవాలి. మా ప్రేమ ఎంత గొప్ప‌ద‌న్న‌ది వాళ్ల‌కి తెలియాలి` అని చెప్పుకొచ్చింది. రాధిక తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక‌ద‌శ‌కు చేరుకున్న త‌ర్వాత ఎలాంటి బంధాలైనా బ‌ల‌ప‌డ‌తాయి. కానీ రాధిక ఆ ఛాన్స్ తీసుకోవ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. త‌మ మ‌ధ్య మొద‌లైన ప్ర‌తీ మూవ్ మెంట్ ని పిల్ల‌ల‌కు కూడా షేర్ చేసి ప్రేమ గొప్ప‌త‌నాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇక అనంత్-రాధిక‌లు చిన్న‌నాటి నుంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రికీ మూగ జీవాలంటే పచ్చి. ఆఆర‌క‌మైన ఆస‌క్తే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు కూడా కార‌ణ‌మైంది. స్నేహితులుగా ఉన్నంత కాలం...క‌లిసి స్కూల్ డేస్ లో ఉన్నా..కాలేజీ చ‌దువులు చ‌దివినా..విదేశాల్లో ఉన్నా ఏనాడు వాళ్ల మ‌ధ్య ప్రేమ పుట్ట‌లేదు. ఆ ప్రేమ‌కు కార‌ణం మూగ‌జీవాలే. వాటిపై ఉండే ప్రేమ ఇద్ద‌ర్నీ నేడు భార్య‌భ‌ర్త‌ల్ని చేస్తుంది.