వెల్ కమ్ టూ మై యూనివర్శ్ మాస్టర్!
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ (ఎల్ సీయూ) పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడో బ్రాండ్.
By: Tupaki Desk | 30 Oct 2024 9:20 AM GMTలోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ (ఎల్ సీయూ) పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడో బ్రాండ్. ఇప్పటికే అతడి యూనివర్శ్ లో కార్తీ, సూర్య, విజయ్, కమల్ హాసన్ లు ఉన్నారు. తాజాగా రాఘవ లారెన్స్ కూడా ఎల్ సీయూలో చేరినట్లు తెలుస్తోంది. లారెన్స్ మెయిన్ లీడ్ లో `బెంజ్` అనే సినిమాని భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి కథ అందించింది లోకేష్ కనగరాజ్. కారణంతో పోరాడే యోధుడు సైనికుడి కంటే ప్రమాదాకరం.
`వెల్కమ్ టూ మై సినిమాటిక్ యూనివర్శ్ మాస్టర్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసాడు లోకేష్. లారెన్స్ బర్త్ డే కానుకగా ఈ బిట్ టీజర్ రిలీజ్ చేసారు. లోకేష్ యూనివర్శ్ కి లింక్ చేస్తూ ఈ కథని, పాత్రని డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది సపరేట్ రిలీజ్ చిత్రమైనా? లొకేష్ ముందు ముందు తీయ బోయే చిత్రాల్లో లారెన్స్ పాత్ర యధా విధిగా కంటున్యూ అవుతుందన్నది దీనర్దంగా తెలుస్తుంది. ఇప్పటికే ఎల్ సీ యూ నుంచి ఖైదీ -2 రానుంది.
`కూలీ` పూర్తియన అనంతరం లోకేష్ ఆ సినిమా పనుల్లో బిజీగా ఉంటాడు. అలాగే సూర్య మెయిన్ లీడ్ లో `రోలెక్స్` టైటిల్ తోనే ఓ సినిమా వస్తుంది. ఇది కూడా ఎల్ సీ యూ నుంచి వచ్చే చిత్రం. అలాగే `లియో-2` కూడా ఉంటుంది. ఇలా ఈ స్టార్ హీరోలందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇన్ బిల్డ్ చేస్తూ ఓ సపరేట్ సినిమా చేస్తాడు. అది ఎల్ సీ యూ ముగింపులో ఉంటుంది. అంతవరకూ లోకేష్ యూనివర్శ్ నుంచి ఈ ఐదేళ్ల కాలంలో రకరకాల చిత్రాలు రిలీజ్ అవుతాయి.
వాటి నుంచి వచ్చే కొత్త హీరోలు ఎల్ సీయూలో యాడ్ అవుతుంటారు. ఇప్పటికే ఈ ఐదేళ్ల ప్రణాళిక లోకేష్ వద్ద సిద్దంగా ఉంది. గన్స్..బాంబులు..తుపాకులు..రక్త పాతం లేకుండా ఈ ఐదేళ్లు సినిమా తీయని ఎలాగూ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఆడియన్స్ కూడా అందుకు సంసిద్దంగా ఉండాల్సిందే సుమీ.