చంద్రముఖి ముందు జాగ్రత్తతో అనుమానాలు..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి చంద్రముఖి హర్రర్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 7 Sep 2023 8:59 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ నటించి చంద్రముఖి హర్రర్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. దెయ్య సినిమాల్లో చంద్రముఖి చాలా స్పెషల్ గా నిలిచింది. అలాంటి చంద్రముఖి కి పార్ట్ 2 రాబోతుంది. రజినీకాంత్ లేకుండానే చంద్రముఖి గా నటించిన జ్యోతిక లేకుండానే పార్ట్ 2 ను దర్శకుడు వాసు రూపొందించాడు.
చంద్రముఖి సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకు చంద్రముఖి 2 ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారని ప్రతి ఒక్కరు భావించారు. పైగా కంగనా రనౌత్ నటించడం వల్ల హిందీలో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి.
ఏం జరిగిందో ఏమో కానీ హిందీ వర్షన్ ను విడుదల చేయబోవడం లేదని మేకర్స్ ప్రకటించారు. హిందీ వర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా ఆ తర్వాత శాటిలైట్ ద్వారా విడుదల చేయబోతున్నారు. తన అభిమానులు చంద్రముఖి 2 సినిమా ను ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా హిందీ ప్రేక్షకులను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇంతకు చంద్రముఖి 2 సినిమా ను హిందీ లో విడుదల చేయక పోవడంకు కారణం అక్కడ సక్సెస్ పై అనుమానాలు ఉండటమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హిందీ వర్షన్ పై అనుమానాలు ఉండటంతో ఇక్కడ చంద్రముఖి 2 పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా లు విడుదల అయ్యి అక్కడ ఇక్కడ మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంగనా వంటి లేడీ సూపర్ స్టార్ నటించిన సినిమాను అక్కడ విడుదల చేయక పోవడం విడ్డూరంగా ఉందని.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకుల్లో సినిమా పై ఉన్న నమ్మకంత సన్నగిల్లేలా చేస్తున్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.