Begin typing your search above and press return to search.

కాంచ‌న 4 పై అవ‌న్నీ రూమ‌ర్లే: లారెన్స్

కొరియోగ్రాఫ‌ర్, హీరో కం డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ త‌న హార‌ర్ ఫ్రాంఛైజీ కాంచ‌న‌(ముని)ను ముందుకు తీసుకెళుతున్నాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 4:37 AM GMT
కాంచ‌న 4 పై అవ‌న్నీ రూమ‌ర్లే: లారెన్స్
X

కొరియోగ్రాఫ‌ర్, హీరో కం డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ త‌న హార‌ర్ ఫ్రాంఛైజీ కాంచ‌న‌(ముని)ను ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. తొలి మూడు భాగాలు త‌మిళం-తెలుగులో గొప్ప విజ‌యాలు సాధించాయి. హార‌ర్ కామెడీ కాన్సెప్టుల‌కు జ‌నాద‌ర‌ణ కొద‌వేమీ లేద‌ని నిరూప‌ణ అయినందున ఇప్పుడు త‌న పాత ఫార్ములానే కొత్త‌గా తీస్తున్నాడు.

గ‌తంలో స్నేహ‌, తాప్సీ, నిత్యామీన‌న్ లాంటి ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు క‌ల్పించిన రాఘ‌వ లారెన్స్ ఈసారి క‌థానాయిక‌గా కీలక పాత్ర కోసం ఎవ‌రిని ఎంపిక చేసుకుంటారు? అంటూ ఆన్ లైన్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. హార‌ర్ కాన్సెప్ట్ సినిమాల్లో త‌న క‌థానాయిక‌ల‌కు కూడా మంచి పేరు తెచ్చాడు లారెన్స్. అందుకే పార్ట్ 4లో అవ‌కాశం అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుంది? అంటూ క్యూరియాసిటీ నెల‌కొంది.

గ‌త కొంత‌కాలంగా కాంచ‌న 4లో ట్యాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. సినిమా క‌థ‌ ఆద్యంతం త‌న పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టు మృణాల్ కు భారీ పారితోషికం ముట్ట‌జెబుతార‌ని కూడా ఊహిస్తున్నారు. అయితే దీనిని రాఘ‌వ‌ లారెన్స్ కొట్టి పారేసారు. తన ప్రాజెక్ట్ పై ఫేక్ క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయ‌ని అత‌డు ధృవీక‌రించాడు. ``హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. కాంచన 4 కి సంబంధించిన సమాచారం, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కాస్టింగ్ అంతా కేవలం పుకార్లు మాత్రమే. త్వ‌ర‌లో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడనుంది``అని స్ప‌ష్ఠ‌త‌నిచ్చాడు. దీంతో మృణాల్ ఎంపిక నిజం కాద‌ని అర్థం చేసుకోవాలి. ఒక‌వేళ నిజం అయినా కానీ లారెన్స్ మాస్టార్ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.